Indian Railways: ట్రైన్ టికెట్ లేకుండానే మహిళలు జర్నీ చేయోచ్చు.. ఎప్పుడో తెలుసా?

Indian Railways New Rules for Woman Traveller Journey With Out Train Ticket Check This New Rules
x

Indian Railways: ట్రైన్ టికెట్ లేకుండానే మహిళలు జర్నీ చేయోచ్చు.. ఎప్పుడో తెలుసా?

Highlights

Indian Railways New Rules: భారతీయ రైల్వేలు ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ల నుంచి మహిళల వరకు రైల్వేశాఖ అనేక ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. రైలులో రోజుకు కోటి మంది ప్రయాణిస్తుంటారు.

Indian Railways Rules For Women: భారతీయ రైల్వేలు ప్రయాణికుల అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ల నుంచి మహిళల వరకు రైల్వేశాఖ అనేక ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే, తాజాగా మీకో ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నాం. అది మహిళా ప్రయాణికులకు సంబంధించిన వార్త. మహిళలు రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణించవచ్చని మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుంటే.. మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.. దీనితో పాటు, కరోనాకు ముందు, రైల్వేలు సీనియర్ సిటిజన్లకు కూడా ఛార్జీలలో రాయితీ ప్రయోజనాన్ని ఇచ్చేవి.

మహిళలు టిక్కెట్ లేకుండా ప్రయాణించవచ్చు..

రైల్వే నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణించే మహిళకు టికెట్ లేకపోతే, ఆమెను రైలు నుంచి దింపకూడదు. మహిళా ప్రయాణీకురాలు రైలులో హడావిడిగా ప్రయాణించాల్సి రావడం, దీంతో టిక్కెట్టు దొరకడం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితిలో, మహిళను రైలు నుంచి దించేయలేరు.

అలాంటి పరిస్థితుల కోసం రైల్వే అనేక స్నేహపూర్వక నియమాలను రూపొందించింది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా రాత్రిపూట రైలులో ఒక మహిళ లేదా బిడ్డ ఒంటరిగా ప్రయాణిస్తుంటే, TTE ఆమెను రైలు నుంచి దించకూడదు. ఇలా చేస్తే సంబంధిత మహిళ రైల్వే అథారిటీకి సంబంధిత టీటీపై ఫిర్యాదు చేయవచ్చు.

రైల్వే హక్కులు ఏమిటో తెలుసా?

భారతీయ రైల్వేలలో, మహిళలు ప్రయాణీకులకు అనేక హక్కులను ఇస్తున్నాయి. దీని ద్వారా మహిళలు ప్రయాణ సమయంలో సమస్యలను పరిష్కరించవచ్చు. ప్రయాణీకులకు అనుకూలమైన మరొక నియమం ఏమిటంటే, టిక్కెట్‌ని తనిఖీ చేయడానికి రాత్రి ప్రయాణ సమయంలో ప్రయాణికులను నిద్రలేపడం ద్వారా టిక్కెట్‌ను చూపించమని TTE డిమాండ్ చేయకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణికులు రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ప్రశాంతంగా నిద్రించవచ్చు. అయితే రాత్రిపూట రైలు ఎక్కిన ప్రయాణికులకు ఈ నిబంధన వర్తించదు.

Show Full Article
Print Article
Next Story
More Stories