Train Journey: రైలులో ఈ వస్తువులతో ప్రయాణం చేస్తున్నారా.. పోలీసులకు దొరికితే ఇక అంతే.. జరిమానా, జైలు శిక్ష పక్కా..!

Indian Railways Never Carry These Items in Train you may be Fined and Imprisonment
x

Train Journey: రైలులో ఈ వస్తువులతో ప్రయాణం చేస్తున్నారా.. పోలీసులకు దొరికితే ఇక అంతే.. జరిమానా, జైలు శిక్ష పక్కా..!

Highlights

Train Booking: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అలాగే చాలా లగేజీతో జర్నీలు చేస్తుంటారు.

Indian Railways: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అలాగే చాలా లగేజీతో జర్నీలు చేస్తుంటారు. అదే సమయంలో, ప్రతిరోజూ ఎంతోమంది రైల్వేలో ప్రయాణిస్తుంటారు.. కాబట్టి వారి భద్రతపై కూడా రైల్వే చాలా శ్రద్ధ వహించాలి. రైలులో ప్రయాణించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రతి ప్రయాణీకుడు అనుసరించడం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో, ఈ రోజు మనం రైల్వే ఒక ముఖ్యమైన నియమం గురించి తెలుకుందాం. దీని కింద రైల్వేలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారు. ఎవరైనా ఈ వస్తువులతో వెళితే, రైల్వే తరపున కూడా చర్యలు తీసుకోవచ్చు.

ఈ వస్తువులు నిషేధం..

రైలులో పటాకులు, మండే పదార్థాలు, ఏదైనా పేలుడు వస్తువులను తీసుకెళ్లడం నిషేధం. మీరు ఈ వస్తువులతో రైలులో ప్రయాణించలేరు. వీటిలో గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు, లాంతర్లు, క్రాకర్లు, కిరోసిన్, పెట్రోల్, లైటర్లు ఉన్నాయి. ఎవరైనా ఈ వస్తువులు కలిగి ఉన్నట్లు తేలితే, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవచ్చు. రైలులో ఈ వస్తువులతో ప్రయాణం చేయడం వల్ల అసురక్షిత వాతావరణం ఏర్పడుతుంది.

రైల్వే చట్టం 1989 ప్రకారం, సెక్షన్ 67, 154,164, 165 ప్రకారం, రైలులో మండే పదార్థాలు, ఏదైనా పేలుడు పదార్థాన్ని తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరం. ఎవరైనా రైలులో ఈ వస్తువులతో దొరికితే, అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా 1 వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ శిక్షలు విధించే ఛాన్స్ ఉంది.

ఇటువంటి పరిస్థితిలో, రైలులో ఈ వస్తువులతో ప్రయాణించవద్దని రైల్వే తరపున ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటారు. దీని కారణంగా, తనతోపాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో పాటు, ఈ పేలుడు వస్తువుల వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం కూడా సంభవించవచ్చు. దీని కారణంగా ప్రయాణికులు ఈ వస్తువులను రైల్వేలో తీసుకెళ్లలేరు.

Show Full Article
Print Article
Next Story
More Stories