Longest Train: 6 ఇంజన్లు.. 295 కోచ్‌లు.. 3.5 కి.మీల పొడవు.. దేశంలోనే అత్యంత పొడవైన రైలు ఇదే..

indian railways longest train called super vasuki
x

Longest Train: 6 ఇంజన్లు.. 295 కోచ్‌లు.. 3.5 కి.మీల పొడవు.. దేశంలోనే అత్యంత పొడవైన రైలు ఇదే..

Highlights

భారతీయ రైల్వేల సముదాయంలో ప్యాసింజర్ రైళ్లు, సెమీ-హై-స్పీడ్ వందే భారత్ కూడా ఉన్నాయి. మరోవైపు బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కూడా ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది.

Longest Train of India: నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్, పొడవైన ప్లాట్‌ఫారమ్ వంటి అనేక రికార్డులు భారతీయ రైల్వేల పేరిట ఉన్నాయి. అయితే, దేశంలోనే అత్యంత పొడవైన రైలులో ఎన్ని కోచ్‌లు ఉన్నాయని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీ దగ్గర సమాధానం లేకపోవచ్చు. అందుకోసమే ఈ ప్రయత్నం. అయితే, దేశంలో అత్యంత పొడవైన రైలు 3.5 కిలోమీటర్ల దూరంతోపాటు 295 కోచ్‌లు ఉన్నాయి.

భారతీయ రైల్వేల సముదాయంలో ప్యాసింజర్ రైళ్లు, సెమీ-హై-స్పీడ్ వందే భారత్ కూడా ఉన్నాయి. మరోవైపు బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కూడా ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది. అయితే, దేశంలోనే అత్యంత పొడవైన రైలు ఏదో తెలుసా? ఈ రైలు చాలా పొడవుగా ఉంది. మీరు దాని కోచ్‌లను లెక్కించి అలసిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారతీయ రైల్వే పరిధిలో రోజుకు 13000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తాయి. దీని ద్వారా రోజుకు 4 కోట్ల మంది ప్రయాణికులు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఉంది.

భారతీయ రైల్వే లెక్కల మేరకు పొడవైన రైలు 3.5 కి.మీ.లు ఉంది. ఒకవైపు నుంచి ఈ రైలు కోచ్‌లను లెక్కించడం ప్రారంభిస్తే కళ్లు అలిసిపోతాయి. కానీ, కోచ్‌ల లెక్కింపు మాత్రం తేలదు. ఈ రైలు పేరు సూపర్ వాసుకి. ఇందులో 295 కోచ్‌లను ఏర్పాటు చేశారు.

ఆరు ఇంజన్లు కలిసి రైలులోని 295 కోచ్‌లను ఇవి లాగుతాయి. ఈ రైలు రైల్వే క్రాసింగ్ గుండా వెళ్ళినప్పుడు, రైలు మొత్తం దాటడానికి చాలా సమయం పడుతుంది. సూపర్ వాసుకి అనేది గూడ్స్ రైలు.

సూపర్ వాసుకి ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలోని గనుల నుంచి సేకరించిన బొగ్గును పవర్ ప్లాంట్లకు రవాణా చేస్తుంటారు. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు ఏకంగా 27 వేల టన్నుల బొగ్గుతో ప్రయాణిస్తుంది.

ఈ గూడ్స్ రైలు కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు దూరాన్ని చేరుకోవడానికి 11.20 గంటలు పడుతుంది. శివుని మెడలో ఉన్న వాసుకి సర్పం పేరు మీదుగా ఈ రైలుకు పేరు పెట్టారు. దేశంలోనే అత్యంత పొడవైన ఈ రైలు నడుస్తుంటే అది పాములా కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories