Longest Railway Platform: దేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్.. నడవాలంటే అలసిపోతారంతే.. ఎక్కడుందో తెలుసా?

Indian Railways: Hubballi Railway Station or Shree Siddharoodha Swamiji Hubballi Junction indias longest railway platform
x

Longest Railway Platform: దేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్.. నడవాలంటే అలసిపోతారంతే.. ఎక్కడుందో తెలుసా?

Highlights

India Longest Railway Platform: మీరు చాలా రైల్వే ప్లాట్‌ఫారమ్‌లను చూసి ఉంటారు. కానీ మీరు ఇప్పటి వరకు భారతదేశంలోని అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఎప్పుడైనా నడిచారా, మీరు నడవడం ప్రారంభించిన తర్వాత మీరు అలసిపోతారు కానీ మీకు మరొక చివర కనిపించదు.

Longest Railway Platform: నెట్‌వర్క్ పరంగా భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉన్నాయి. ప్రతిరోజూ 40 మిలియన్ల మంది ప్రయాణికులు రైళ్లలో తమ గమ్యస్థానం వైపు ప్రయాణిస్తుంటారు. భారతీయ రైల్వేలు దానితో పాటు అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా కలిగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. అలాంటి అద్భుతమైన వాస్తవాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. రైల్వే స్టేషన్‌కి వెళ్లిన తర్వాత అక్కడ నిర్మించిన ప్లాట్‌ఫారమ్‌లను మనం చూస్తూనే ఉంటాం. భారతదేశంలో అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్ ఎక్కడ ఉందో తెలుసా? ఈ ప్లాట్‌ఫారమ్‌లు చాలా పొడవుగా ఉంటాయి. వీటిపై నడుస్తూనే ఉండాలి. దాని మరొక చివరను అంత త్వరగా చేరుకోలేరు. ఈ ప్లాట్ ఫాం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది.

అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌..

దేశంలోని ఈ పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ కర్ణాటకలోని హుబ్లీ జిల్లాలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ పూర్తి పేరు శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్లీ రైల్వే స్టేషన్. కేంద్ర ప్రభుత్వం రూ.20.1 కోట్లతో ఈ స్టేషన్‌ను పునర్నిర్మించింది. ఈ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వే నైరుతి రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

హుబ్లీ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం..

హుబ్లీ రైల్వే స్టేషన్ కర్ణాటకలో ఒక ముఖ్యమైన జంక్షన్. ఈ జంక్షన్ నుంచి రైలు మార్గాలు బెంగళూరు, హోస్‌పేట, గోవా, బెలగావి వైపు వెళ్తాయి. ఉత్తర కర్ణాటకలో ఈ జిల్లా వ్యాపారానికి కూడా కీలక కేంద్రంగా ఉంది. దీని ద్వారా కర్ణాటకలో తయారైన ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపడంతోపాటు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తున్నప్పుడు పాదాలు అలసిపోతాయంతే..

రైల్వే స్టేషన్‌పై పెరుగుతున్న భారాన్ని తగ్గించేందుకు, 5 పాత ప్లాట్‌ఫారమ్‌ల పునరుద్ధరణతో పాటు, 3 కొత్త ప్లాట్‌ఫారమ్‌లను కూడా అక్కడ నిర్మించారు. వీటిలో ప్లాట్‌ఫారమ్ నంబర్-8 పొడవు 1507 మీటర్లు. ఇది భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ కూడా. ఈ ప్లాట్‌ఫారమ్ సుదీర్ఘ సరుకు రవాణా రైళ్ల బస కోసం అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుంచి రెండు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్రైట్ రైళ్లు ఒకేసారి నడుస్తాయి.

రెండో స్థానంలో UPలోని ఈ రైల్వే జంక్షన్..

హుబ్లీలో నిర్మించిన ఈ రైల్వే ప్లాట్‌ఫారమ్ దేశంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్ టైటిల్‌ను యూపీలోని గోరఖ్‌పూర్ రైల్వే జంక్షన్ నుంచి ఆ స్థానాన్ని తీసేసుకుంది. ఇప్పుడు ఈ విషయంలో రెండో స్థానంలో గోఖ్‌పూర్ జంక్షన్‌లోని రైల్వే ప్లాట్‌ఫారమ్ పొడవు 1,366.33 మీటర్లుగా ఉంది. అదే సమయంలో కేరళలోని కొల్లం జంక్షన్‌లో నిర్మించిన రైల్వే ప్లాట్‌ఫాం పొడవు 1180.5 మీటర్లుగా ఉంది. ఇది దేశంలోనే మూడవ పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories