Indian Railways: వామ్మో.. ఇదెక్కడి రైలు బాబోయ్.. ఏడాదిలో రూ. 63 కోట్ల నష్టం.. ప్రతిరోజూ వందల ఖాళీ సీట్లతో జర్నీ..

Indian Railways Delhi to Lucknow and Kanpur Central Tejas Train Gave RS 63 Crore Loss to IRCTC
x

Indian Railways: వామ్మో.. ఇదెక్కడి రైలు బాబోయ్.. ఏడాదిలో రూ. 63 కోట్ల నష్టం.. ప్రతిరోజూ వందల ఖాళీ సీట్లతో జర్నీ..

Highlights

Indian Railways Facts: రైల్వేల నష్టం కొంచెం వింతగా అనిపిస్తుంది. ఆదాయాల పరంగా, 2022-23 సంవత్సరంలో రైల్వేలు అత్యధికంగా ఆర్జించాయి.

Indian Railways Facts: రైల్వేల నష్టం కొంచెం వింతగా అనిపిస్తుంది. ఆదాయాల పరంగా, 2022-23 సంవత్సరంలో రైల్వేలు అత్యధికంగా ఆర్జించాయి. రైల్వేలు ఇచ్చిన సమాచారం ప్రకారం, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ రైలు ఒక్క ఏడాదిలో రూ.176 కోట్లు రాబట్టింది. అయితే, అత్యధిక నష్టం కలిగించిన రైలు కూడా ఒకటి ఉంది.

ఢిల్లీ నుంచి నడిచే రైలు వల్ల రూ.63 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది వినడానికి కొంత నమ్మశక్యంగా ఉండొచ్చు. కానీ, ఇది నిజం. తేజస్ రైళ్ల నిర్వహణను రైల్వే శాఖ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించింది. ప్రస్తుతం తేజస్ రైళ్లు ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య నడిపిస్తోంది.

2022 సంవత్సరంలో IRCTC ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ రెండు రైళ్లు నష్టాల్లో నడుస్తున్నాయి. 2022 సంవత్సరపు డేటా ప్రకారం, ఢిల్లీ నుంచి లక్నో నుంచి కాన్పూర్ సెంట్రల్ తేజస్ రైలు రూ. 27.52 కోట్ల నష్టంతో నడుస్తోంది. ప్రయాణికులు అందుబాటులో లేకపోవడం, నిరంతర నష్టాల కారణంగా తేజస్ రైలు ట్రిప్పులు కూడా తగ్గాయి. మొదట్లో వారానికి ఆరు రోజులు నడిచిన ఈ రైలు తర్వాత నాలుగు రోజులకు కుదించారు.

రైలు నష్టాలకు కారణం ప్రతిరోజూ 200 నుంచి 250 సీట్లు ఖాళీగా ఉంటున్నాయంట. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ దాని కంటే ముందు నడుస్తున్నందున దాని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఛార్జీలు తేజస్ కంటే తక్కువే కానీ సౌకర్యాల పరంగా మాత్రం తేజస్ కంటే తక్కువ కాదు. ఇటువంటి పరిస్థితిలో ప్రయాణీకులు తేజస్‌ను ఎంపికగా మాత్రమే చూస్తున్నారు.

కరోనా తర్వాత, తేజస్ ఫ్రీక్వెన్సీలో మార్పు వచ్చింది. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉన్నందున, దాని ఆపరేషన్ 2019, 2022 మధ్య 5 సార్లు తాత్కాలికంగా నిలిపివేసింది. లక్నో-న్యూఢిల్లీ మార్గంలో 2019-20లో తేజస్ రూ. 2.33 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కానీ దీని తర్వాత 2020-21లో రూ.16.69 కోట్లు, 2021-22లో రూ.8.50 కోట్ల నష్టం వచ్చింది.

2019లో, రైల్వే అహ్మదాబాద్-ముంబై, లక్నో-ఢిల్లీ తేజస్ రైళ్ల నిర్వహణ బాధ్యతను IRCTCకి అప్పగించింది. మూడేళ్లలో రెండు రైళ్ల నష్టాలు రూ.62.88 కోట్లకు పెరిగాయి. దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారులు మాట్లాడుతూ, కరోనా కాలంలో రైళ్లు ఎక్కువసేపు మూసి ఉన్నప్పటికీ రైల్వేలకు ఛార్జీలు చెల్లించామని తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినప్పుడు పరిస్థితులు చక్కబడతాయని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories