Indian Railways: రైలులో ఇలా చేస్తున్నారా.. ముందు ఈ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే జరిమానాతోపాటు జైలుశిక్ష..!

Indian Railway Rules On The Chain Pulling In Train Check Here Full Details
x

Indian Railways: రైలులో ఇలా చేస్తున్నారా.. ముందు ఈ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే జరిమానాతోపాటు జైలుశిక్ష..!

Highlights

Indian Railways Rules: ప్రతిరోజూ లక్షల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. కానీ, చాలామందికి రైల్వే నిబంధనల గురించి తెలియదు. మీరందరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన రైల్వే నియమం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Indian Railways Rules: ప్రతిరోజూ లక్షల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. కానీ, చాలామందికి రైల్వే నిబంధనల గురించి తెలియదు. మీరందరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన రైల్వే నియమం గురించి ఈ రోజు తెలుసుకుందాం. రైలును ఆపడానికి లేదా చైన్ లాగడానికి ప్రయాణికులకు రైల్వే హక్కును ఇచ్చింది. అయితే ఇది ఏదైనా సమస్య ఉన్నప్పుడు లేదా ప్రయాణీకుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది. చైన్ పుల్లింగ్‌కి సంబంధించిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా సార్లు చైన్ లాగి పారిపోతుంటారు..

చైన్‌లు లాగి పారిపోవాలని ప్రయాణికులు అనుకోవడం చాలా సార్లు జరుగుతుంది. కానీ, పోలీసులు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. దీని కారణంగా ఇలాంటి చర్యలకు పాల్పడేవారు పట్టుబడుతున్నారు.

చైన్ పుల్లింగ్ గురించి రైల్వేకు ఎలా తెలుసు?

రైలులో చైన్ లాగడం జరిగినప్పుడు, బోగీ ఎగువ మూలలో అమర్చబడిన వాల్వ్ తిరుగుతుంది. ఏ బోగీ చైన్ లాగారో ప్రధాన నియంత్రణ వ్యవస్థకు ఇట్టే తెలిసిపోతుంది.

గొలుసు లాగినప్పుడు శబ్దం..

చైన్ లాగగానే ఆ బోగీలోంచి ప్రెషర్ లీక్ అవుతున్న శబ్దం వినిపిస్తుంది. అలాంటి శబ్దం వినగానే రైల్వే పోలీసులు ఆ బోగీ దగ్గరికి చేరుకుంటారు. ఆ తర్వాత చైన్‌ లాగడానికి గల కారణాలను, మిగతా విషయాలన్నీ తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తారు.

ఎలాంటి సందర్భంలో హక్కు ఉంటుంది?

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చైన్ లాగేందుకు ప్రయాణికులను రైల్వే అనుమతిస్తోంది. ఒకరి కుటుంబంలోని ఎవరైనా ప్లాట్‌ఫారమ్‌పై ఉండిపోయినా లేదా ప్రయాణంలో ఏదైనా సమస్య తలెత్తినా, ఆ పరిస్థితిలో ప్రయాణీకుడు చైన్ లాగడానికి అనుమతించబడతారు.

రైల్వే శిక్షలు..

రైల్వే నిబంధనల ప్రకారం ఎవరైనా ప్రయాణికులు అనవసరంగా రైలు చైన్ లాగితే అది నేరంగా పరిగణించబడుతుంది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం రైలును ఆపిన వ్యక్తిపై రైల్వే చర్యలు తీసుకుంటుంది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే, రూ. 1000 జరిమానా (రైలులో చైన్ లాగినందుకు శిక్ష) లేదా 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు శిక్షలు కూడా విధించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories