వెయిటింగ్ లిస్ట్ సమస్యకు చెక్.. ఇకపై టికెట్ కన్ఫర్మ్ పక్కా.. వచ్చేస్తోంది రైల్వే సూపర్ యాప్‌.. ఎలా పనిచేస్తుందంటే?

Indian Railway No Waiting Ticket With Indian Railway Super App Check how to Work
x

వెయిటింగ్ లిస్ట్ సమస్యకు చెక్.. ఇకపై టికెట్ కన్ఫర్మ్ పక్కా.. వచ్చేస్తోంది రైల్వే సూపర్ యాప్‌.. ఎలా పనిచేస్తుందంటే?

Highlights

భారతీయ రైల్వేలు ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నప్పటికీ, కన్ఫర్మ్ టికెట్ పొందడంలో జాప్యం జరుగుతోంది.

How to Book Confirm Train Ticket: రైళ్లలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ క్రమంలో టిక్కెట్లు బుక్ చేసినా.. వెయింట్ లిస్ట్‌లో ఉంటుంటాయి. ఈ క్రమంలో టిక్కెట్ల ఇబ్బందులను నివారించడానికి రైల్వే సన్నద్ధమైంది. ఇందుకోసం రైల్వేశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్లాన్ తరువాత, కన్ఫర్మ్ టిక్కెట్లు పొందాలనే ప్రజల ఆశలు 90 శాతం పెరుగుతాయంట.

భారతీయ రైల్వేలు ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నప్పటికీ, కన్ఫర్మ్ టికెట్ పొందడంలో జాప్యం జరుగుతోంది. ఇది పండుగ సీజన్ లేదా సెలవుల సీజన్ అయితే, కన్ఫర్మ్ టికెట్ పొందడం చాలా కష్టం అవుతుంది. రైళ్లలో రద్దీ, టిక్కెట్ల కోసం వేచి ఉండే ఇబ్బందులను నివారించేందుకు రైల్వేశాఖ సన్నద్ధమైంది.

వెయిటింగ్ టిక్కెట్లను తగ్గించేందుకు భారతీయ రైల్వే ప్రణాళిక రూపొందించింది. రైల్వే ప్రయాణికులకు కన్ఫర్మ్ చేసిన టిక్కెట్లను ప్రవేశపెట్టే మొదటి దశ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చు. ముందుగా కొన్ని ఎంపిక చేసిన రూట్లలో ట్రయల్ చేస్తున్నారు. రైల్వే ఈ దశతో, ధృవీకరించిన టిక్కెట్ల లభ్యత 90 శాతం వరకు నిర్ధారించే అవకాశం ఉందంట.

రైల్వే తన సూపర్ యాప్‌లో ప్రజలకు అన్ని సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో, డేటా విశ్లేషణ ద్వారా రైళ్లలో ధృవీకరించిన టిక్కెట్ల లభ్యత పెరుగుతుంది. 500 కి.మీ కంటే తక్కువ దూరాన్ని కవర్ చేసే కొన్ని ఎంపిక చేసిన రూట్లలో, నిర్ధారిత టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల డేటా అలాగే వెయిటింగ్ టిక్కెట్లు విశ్లేషణ చేస్తున్నారు. దీని ద్వారా ఆయా రూట్లలో ఏయే కేటగిరీలో ప్రతిరోజు ఎంత మంది ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ తీసుకుంటున్నారనే సమాచారం రానుంది. ఇది కాకుండా, ప్రస్తుతం ధృవీకరించిన టిక్కెట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. వీటి లభ్యతను విశ్లేషించడం ద్వారా డేటా తయారు చేస్తున్నారు. దీని ఆధారంగా రాబోయే కొన్నేళ్లలో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల సమస్య తొలగించనుందంట.

2031-32 సంవత్సరం నాటికి రైళ్లలో వేచి ఉండే టిక్కెట్ల ఇబ్బందిని తొలగించాలని రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందుకోసం 500 కి.మీ కంటే తక్కువ దూరం ప్రయాణించే రైల్వే రూట్లలోని వెయిటింగ్ టికెట్లతోపాటు కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికుల డేటాను రైల్వే సేకరిస్తోంది. దేశంలో ధృవీకరించిన టిక్కెట్‌ల కోసం ప్రస్తుత డిమాండ్ ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో డిమాండ్ లెక్కించబడుతుంది. 2031 నాటికి నిరీక్షణ సమస్యను తొలగించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.

దేశంలోని అన్ని ఎంపిక చేసిన ట్రాక్‌లలో ప్రయాణీకులకు ధృవీకరించిన సీట్లు అందించడానికి ప్రసిద్ధ రైళ్లు కాకుండా, ఒక గంట వ్యవధిలో మరొక రైలును నడపాలని రైల్వే యోచిస్తోంది. ఈ విధంగా, ఆ మార్గంలో ప్రయాణీకులు కన్ఫర్మ్ టిక్కెట్లను పొందడం సులభం అవుతుంది. టికెట్ బుకింగ్ ఆధారంగా రైళ్లలో కోచ్‌లను నిర్ణయిస్తారు. ఈ రైళ్లలో ప్రజలు టిక్కెట్టు ఛార్జీలలో వ్యత్యాసం చెల్లించి ప్రయాణించవచ్చు.

ఇందుకోసం భారతీయ రైల్వే ఒక సూపర్ యాప్‌ను తయారు చేయబోతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే తెలియజేశారు. ఈ సూపర్ యాప్ సహాయంతో, ప్రజలు ఒకే చోట రైల్వే అన్ని సేవలు, సౌకర్యాల గురించి సమాచారాన్ని, సౌకర్యాలను పొందగలుగుతారు. ఈ యాప్ సహాయంతో, ప్రజలు టికెట్ బుకింగ్ నుంచి రిజర్వ్ చేసిన లేదా రిజర్వ్ చేయని సీట్ల వివరాలు, రైళ్ల స్థితికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుతారు.

రైల్వేశాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మరో 6 నెలల్లో సూపర్ యాప్ రెడీ అవుతుంది. ఈ యాప్‌లో వారు తమ రూట్లలో ప్రయాణించేందుకు తమ ప్రయాణ వివరాలను నమోదు చేసిన వెంటనే, రైళ్లలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని బుక్ అయ్యాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి అనే పూర్తి వివరాలను చూసే సదుపాయం ఈ యాప్‌లో ఉంటుందంట.

Show Full Article
Print Article
Next Story
More Stories