Indian Passport: మూడు రంగుల్లో ఇండియన్ పాస్‌పోర్ట్.. అలా ఎందుకు ఉంటాయో తెలుసా?

Indian Passports in Three Colours Like Maroon, White and Blue in Color do you Konw the Reason Check Here
x

Indian Passport: మూడు రంగుల్లో ఇండియన్ పాస్‌పోర్ట్.. అలా ఎందుకు ఉంటాయో తెలుసా?

Highlights

Indian Passport Color: పాస్‌పోర్ట్ ఒక కీలక పత్రం. ఇది లేకుండా మీరు విదేశాలకు వెళ్లలేరు. అదే సమయంలో ఇది దేశంలో గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు. భారతదేశంలో పాస్‌పోర్ట్ నీలం రంగులో మాత్రమే కాదు.. మరికొన్ని రంగులలో కూడా ఉంటుంది.

Indian Passport Color: పాస్‌పోర్ట్ ఒక కీలక పత్రం. ఇది లేకుండా మీరు విదేశాలకు వెళ్లలేరు. అదే సమయంలో ఇది దేశంలో గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు. భారతదేశంలో పాస్‌పోర్ట్ నీలం రంగులో మాత్రమే కాదు.. మరికొన్ని రంగులలో కూడా ఉంటుంది. ప్రతి పాస్‌పోర్ట్ దాని స్వంత ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుంది. ఇది ఒక నిర్దిష్ట గుర్తింపును హైలైట్ చేస్తుంది. భారతీయ పాస్‌పోర్ట్‌లు మూడు రంగుల్లో ఉంటాయి. భారతీయ పాస్‌పోర్ట్ మెరూన్, తెలుపు, నీలం రంగులో ఉంటుంది.

అయితే, పాస్‌పోర్ట్‌లు ఎందుకు వేర్వేరు రంగులను కలిగి ఉంటాయి. అవి వేర్వేరు రంగులలో ఎందుకు ఉంటాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సామాన్య ప్రజల కోసం నీలం రంగు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. దీనితో మీరు విదేశాలకు ప్రయాణం చేయవచ్చు. దీంతో పాటు ఉద్యోగం, విద్య, ఆరోగ్యం తదితర ఏ పనికైనా ఈ పాస్‌పోర్ట్‌పై అనుమతులు తీసుకోవచ్చు.

వైట్ కలర్ పాస్‌పోర్ట్ గురించి చెప్పాలంటే, ఏదైనా ప్రభుత్వ పని కోసం విదేశాలకు వెళ్ళే వ్యక్తికి ఇది ఇస్తుంటారు. ఈ పాస్‌పోర్ట్‌పై ప్రత్యేకాధికారాలు ఉన్నాయి. ఈ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రభుత్వ అధికారి అని అర్థం చేసుకోవచ్చు.

దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులకు మెరూన్ రంగు పాస్‌పోర్ట్ జారీ చేస్తుంటారు. ఈ పాస్‌పోర్ట్ ఉంటే విదేశాలకు వెళ్లేందుకు వీసా అవసరం లేదు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది.

పాస్‌పోర్ట్ ప్రభుత్వం జారీ చేస్తుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మళ్లీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories