Fastest Trains: భారతదేశపు అత్యంత వేగవంతమైన 5 రైళ్లు ఇవే.. స్పీడ్ చూస్తే భూమి కంపించాల్సిందే..!

India 5 Fastest Trains Travels Between Delhi and Bhopal Check Full Details
x

Fastest Trains: భారతదేశపు అత్యంత వేగవంతమైన 5 రైళ్లు ఇవే.. స్పీడ్ చూస్తే భూమి కంపించాల్సిందే..!

Highlights

India Fastest Train: భారతీయ రైళ్లలో ప్రతిరోజు ఎంతోమంది ప్రయాణిస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలులో ప్రయాణించారా?

India Fastest Train: భారతీయ రైళ్లలో ప్రతిరోజు ఎంతోమంది ప్రయాణిస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలులో ప్రయాణించారా? ఆ రైలు ఎంత వేగంతో నడుస్తుందో తెలుసా? అంటే, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత కూడా దీని ముందు డీలా పడుతుందన్నమాట.

భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. వాటి పేరుకు తగ్గట్టుగానే ఈ రైళ్లు భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయి. ఈ రైళ్ల వేగం గంటకు 180 కి.మీలు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వీటిని గంటకు 160 కి.మీ వేగంతో నడుపుతున్నారు. ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచింది.

ఈ రైలు వేగం పరంగా భారతదేశం రెండవ వేగవంతమైన రైలుగా పేరుగాంచింది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 160 కి.మీ.లు. ఈ రైలు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రా మార్గంలో నడుస్తుంది. ఈ రైలు ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తి చేస్తుంది. ఉచిత Wi-Fi, పూర్తి AC, చైర్ కార్ వంటి సౌకర్యాలు ఈ రైలులో అందుబాటులో ఉన్నాయి.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకప్పుడు భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లుగా పరిగణిస్తుంటారు. కానీ, ఇప్పుడు అవి వేగం పరంగా మూడవ స్థానానికి చేరుకుంది. వేగం పరంగా, న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు దేశంలో మూడవ అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. దీని వేగం గంటకు 150 కి.మీ.లుగా ఉంది. ఈ రైలులో ప్రయాణీకులకు ఏసీ, ఆహారం వంటి పూర్తి సౌకర్యాలు కల్పిస్తారు.

ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వేగం గంటకు 140 కి.మీ.లుగా ఉంటుంది. ఇది దేశంలోనే నాల్గవ అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచింది. ఈ రైలులో ప్రయాణీకులకు వాటర్ బాటిల్స్, స్నాక్స్, టీ-కాఫీ, ఐస్ క్రీం అందిస్తారు. పరిశుభ్రత విషయంలో ఈ రైలు సాటిలేనిదిగా చెబుతుంటారు.

ఈ రైలు వేగం పరంగా దేశంలో 5వ స్థానంలో ఉంది. అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఈ రైళ్లకు ఈ పేరు పెట్టారు. ఈ రైలు న్యూ ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా జంక్షన్ వరకు వెళుతుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 135 కి.మీ.లుగా ఉంది. ఈ రైలులో స్నాక్స్, టీ-కాఫీ కూడా అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories