సైబర్‌ క్రైమ్‌ జరిగితే ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.. ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు..!

సైబర్‌ క్రైమ్‌ జరిగితే ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.. ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు..!
x

In Case Of Cyber Crime In Which Police Station To File A Complaint

Highlights

Cyber Crime Complaint: ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇంటర్నెట్‌ ఉపయోగించి ఆన్‌లైన్‌ షాపింగ్‌, మనీ ట్రాన్స్‌ఫర్, యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నారు.

Cyber Crime Complaint: ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇంటర్నెట్‌ ఉపయోగించి ఆన్‌లైన్‌ షాపింగ్‌, మనీ ట్రాన్స్‌ఫర్, యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నారు. ఇవేకాదు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఇంటి నుంచే అన్ని చెల్లింపులు చేస్తున్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతున్న మాట వాస్తవమే కానీ సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. కొంతమంది వారికి తెలియకుండానే సైబర్‌ నేరస్థుల బారిన పడుతున్నారు. లక్షల రూపాయలని కోల్పోతున్నారు. అయితే ఒకసారి సైబర్‌ దాడికి గురైనట్లయితే వారు ఎక్కడ ఫిర్యాదు చేయాలి.. కేసు విషయాలని ఎలా తెలుసుకోవాలి.. తదితర విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

సైబర్ క్రైమ్ దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందం ఉంటుంది. ఇది సైబర్ క్రైమ్‌కు సంబంధించిన అన్ని కేసులను దర్యాప్తు చేస్తుంది. సైబర్‌ క్రైమ్‌ జరిగినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రాంతంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. అయితే పోలీసుల నుంచి క్రైమ్ నంబర్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ నంబర్ మీ కేసును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించవచ్చు.

సైబర్ మోసం గురించి ఎలా ఫిర్యాదు చేయాలి?

మీరు ఆన్‌లైన్ మోసానికి గురైనట్లయితే ముందుగా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి. తర్వాత పూర్తి సమాచారం అందించాలి. అలాగే జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 155260కి కూడా ఫోన్‌ చేసి కేసు నమోదు చేయవచ్చు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

కంప్లెయింట్ నమోదు చేసిన తర్వాత ఖచ్చితంగా క్రైమ్ నంబర్ తీసుకోవాలి. ఈ నంబర్ నుంచి మాత్రమే కేసుపై తదుపరి చర్య తీసుకుంటారు. ఇది కాకుండా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి ఎప్పటికప్పుడు కేసు అప్‌డేట్‌లను తెలుసుకుంటూ ఉండాలి. సైబర్ బ్రాంచ్ అధికారికి మొత్తం విషయాన్ని వివరించాలి. ఇ-కామర్స్‌లో మోసానికి గురైనట్లయితే బ్యాంక్ ఇ-కామర్స్ డ్యాష్‌బోర్డ్‌కు పంపిస్తారు. ఆన్‌లైన్ మోసం విషయంలో ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత మంచిది ఎందుకంటే మొదటి 3 నుంచి 4 గంటలు కీలకం. మీ డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories