Snake Revenge: పాముని చంపితే పగబడుతుందా.. దీని వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటంటే..?

If You Kill A Snake Does It Take Revenge Know The Secret Behind This
x

Snake Revenge: పాముని చంపితే పగబడుతుందా.. దీని వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటంటే..?

Highlights

Snake Revenge: పాముని చంపితే పగబడుతుందని చాలాసార్లు వినే ఉంటారు. కానీ నిజంగా ఇలా జరుగుతుందా.. వాస్తవానికి భారతదేశంలో పాముని దైవంగా పూజిస్తారు.

Snake Revenge: పాముని చంపితే పగబడుతుందని చాలాసార్లు వినే ఉంటారు. కానీ నిజంగా ఇలా జరుగుతుందా.. వాస్తవానికి భారతదేశంలో పాముని దైవంగా పూజిస్తారు. నాగుల పంచమి రోజు పాముకి పాలు కూడా పోస్తారు. వాస్తవానికి పాములు పగబట్టలేవు పాలు కూడా తాగలేవు. ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ విక్టోరియా మ్యూజియంలో అనేక రకాల పాము జాతులు ఉన్నాయి. వీటికి సంబంధించిన సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంది. ఇందులో పాముల పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు.

విక్టోరియా మ్యూజియం వెబ్‌సైట్‌ ప్రకారం పాములకు ఎలాంటి సామాజిక బంధం ఉండదు. పాముపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించి పాము ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యం కాదు. నిజానికి పాముల జ్ఞాపకశక్తి అంత వేగంగా ఉండదు. సినిమాల కారణంగా ఈ రూమర్ వ్యాపించింది. ఇందులో నిజం లేదు. కానీ పాము చెవులు సాధారణ జంతువుల వలె బయట కనిపించవు. భూమి నుంచి ఉత్పన్నమయ్యే శబ్ధం నుంచి ఎవరైనా తమ దగ్గరికి వస్తున్నారని గ్రహించగలవు.

అయితే పాముని చంపినప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. ఎక్కడ పాముని చంపితే అక్కడ దాని శరీరం నుంచి సలైవా లాంటిది విడుదల అవుతుంది. పాముని చంపిన తర్వాత ఆ ప్రదేశాన్ని డెటాల్ లేదా ఫినాయిల్ తీసుకుని శుభ్రం చేస్తే ఆ వాసన పోతుంది. లేదంటే కొద్దిగా పసుపు తో ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయొచ్చు. దీనివల్ల మరొక పాము అక్కడికి రాదు. లేదంటే పాము సలైవ గుర్తించి ఆ ప్రదేశానికి మరొక పాము వస్తుంది. పాములు చంపినప్పుడు రిలీజ్ చేసిన ఆ ద్రవ పదార్థం పాములు మేటింగ్ సమయంలో రిలీజ్ చేస్తుంటాయి. అలాగే చనిపోయిన సమయంలో కూడా రిలీజ్ చేస్తుంటాయి. ఆ వాసనకి మరొక పాము అక్కడికి చేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories