తల్లిదండ్రులకి హెచ్చరిక.. పిల్లలు చేసే ఈ తప్పు వల్ల జైల్లో గడపాల్సిందే..!

If Parents let Their Children Drive a car or Bike they Will have to Spend Time in Jail Along With a Fine
x

తల్లిదండ్రులకి హెచ్చరిక.. పిల్లలు చేసే ఈ తప్పు వల్ల జైల్లో గడపాల్సిందే..!

Highlights

Children Drive Rules: మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌కి అప్లై చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Children Drive Rules: మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌కి అప్లై చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ ఈ నిబంధనను ఉల్లంగించి చాలాసార్లు మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఎక్కువగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, చిన్నవయసులో డ్రైవింగ్‌ చేస్తూ ట్రాఫిక్‌ పోలీసులకి చిక్కుతున్నారు. అంతేకాదు ఒక్కోసారి వారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అందుకే బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు పిల్లలని గమనిస్తూ ఉండాలి.

మీ పిల్లల వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే వారికి మోటార్ సైకిల్ లేదా కారు కీలు ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ మీరు కీని ఇచ్చి ఆ పిల్లవాడు ఏదైనా ప్రమాదానికి కారణం అయితే వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ వర్తంచదని గుర్తుంచుకోండి. అంతేకాదు మీరు ఎటువంటి క్లెయిమ్ చేయలేరు. మైనర్ డ్రైవింగ్ చేస్తుంటే అతనికి బీమా ప్రయోజనాలు వర్తించవు. ఈ సందర్భంలో ఎలాంటి దావా వేయడానికి వీలు పడదు.

ఇది కాకుండా మైనర్‌లలో ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్టప్రకారం.. అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై చర్య తీసుకుంటారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే అతని తల్లిదండ్రులకు 25 వేల రూపాయల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అతనికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అందుకే మీ బిడ్డ మైనర్ అయితే ఎట్టిపరిస్థితులలోనే వారు వాహనం నడపడానికి అనుమతించకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories