పిల్లలు చేసే ఈ తప్పులకు తల్లిదండ్రులు జైలుకెళుతారు..!

If Children Are Caught Driving A Car Bike Or Scooter The Parents Will Have To Go To Jail
x

పిల్లలు చేసే ఈ తప్పులకు తల్లిదండ్రులు జైలుకెళుతారు..!

Highlights

Traffic Rules: భారతదేశంలో రోడ్డు భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఏటా 1.5 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.

Traffic Rules: భారతదేశంలో రోడ్డు భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఏటా 1.5 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. మృతుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిలో ట్రాఫిక్‌కు సంబంధించిన కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి. భారతదేశంలో జువైనల్ డ్రైవింగ్ కోసం కఠినమైన చట్టాలు ఉన్నాయి. మైనర్‌లకు (18 ఏళ్లలోపు) కార్లు లేదా ఇతర మోటారు వాహనాలు నడపడానికి అనుమతి లేదు. డ్రైవింగ్‌లో పట్టుబడితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు కొన్ని పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు జైలుకు వెళ్లవలసి ఉంటుంది.

నియమాలు ఏమిటి?

నిబంధనల ప్రకారం మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే సంరక్షకుడు/వాహన యజమానిని దోషిగా పరిగణిస్తారు. ఇందుకు రూ. 25,000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వాహన రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం వరకు రద్దు చేస్తారు. ఇది మాత్రమే కాదు పట్టుబడిన మైనర్ 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందలేరు. సాధారణ పరిస్థితుల్లో అయితే అతను 18 సంవత్సరాల వయస్సులో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.

ఈ నియమం ఎందుకు అవసరం?

జువైనల్ డ్రైవర్లు తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ప్రమాదాలు పెరుగుతాయి. పిల్లలు అనుభవం లేనివారు, రహదారిపై వచ్చే వాహనాలను సరిగ్గా గమనించలేరు. అంతేకాకుండా మైనర్లు తరచుగా డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటారు. నిబంధనలను పాటించరు. దీంతో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. మైనర్లు మోటారు వాహనాలను నడపకుండా నిరోధించడం చాలా ముఖ్యం. అందుకే ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories