కోడిపై హిప్నాటిజం... గీత గీస్తే చాలు అలానే ఉండిపోతుంది... సీక్రెట్ ఇదే..

కోడిపై హిప్నాటిజం... గీత గీస్తే చాలు అలానే ఉండిపోతుంది... సీక్రెట్ ఇదే..
x
Highlights

హిప్నాటిజం అనేది సమ్మోహపరిచే విద్య. దీనిని సాధారణంగా మనుషులపైనే చేస్తారు అని తెలుసు కానీ, జంతువులపైనా కుడా చేస్తారని మీకు తెలుసా? ఓ కోడిపై హిప్నాటిజం...

హిప్నాటిజం అనేది సమ్మోహపరిచే విద్య. దీనిని సాధారణంగా మనుషులపైనే చేస్తారు అని తెలుసు కానీ, జంతువులపైనా కుడా చేస్తారని మీకు తెలుసా? ఓ కోడిపై హిప్నాటిజం చేసినట్టు చూపించిన ఓ వీడియో ప్రస్తుత్తం వైరల్ అవుతోంది. అందులో ముందుగా కోడిని పట్టుకొని ఎక్కడో ఒకచోట కూర్చోబెట్టి.. దాని మెడను పట్టుకొని సరాసరి భూమిపై దాని ముక్కు నేలకు తగిలేలా ఉంచారు. తరువాత కోడి ముందు భాగంవైపు ఓ వ్యక్తి వచ్చి.. దాని ముక్క సూటిగా వేలుతో కోడి ముక్కు ముందు సక్కగా ఓ గీత గీసారు. అంతే ఒక్క దెబ్బకు వర్కఅవుట్ అయిపోయింది. అలా ఆ వ్యక్తి గీసిన గీతవైపే చూస్తూ కోడిపుంజు ఉండిపోయింది. ఇప్పడు వైరల్ అయిన ఈ వీడియోపై సోషల్ మీడియా నెటిజన్లు తమ భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. స్వాగతిస్తున్నారు. మరికొంత మంది అసాధ్యం అని కొట్టిపారేస్తున్నారు. ఇంకోంతమందైతే చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఎందుకిలా అవుతుంది?

కోడి అచేతనకు ఎలా గురవుతుందని అని అనుకుంటున్నారా? దీనికి కారణం కుడా కొంతమంది అంచనావేసి చెబుతున్నారు. ఆ కోడిపుంజును బలవంతంగా దాని మెడను నెలపై పెడుతున్నప్పుడు అది చాలా భయంతో వణికిపోతుంది. ఆ సమయంలో దానికి సెమీ పెరాలసిస్(తాత్కాలిక పక్షవాతం) వస్తోంది. ఆ సమయంలో మనం గీత గీసినప్పుడు తనకు ఏదో ఆపద ఉందని భావిస్తుంది. ఎదురుగ ఉన్న వ్యక్తి, తానను పట్టుకున్న వ్యక్తి ఎలాగు వదిలిపెట్టరనే భావనలో ఉండిపోతుంది. అప్పుడు తానను తాను రక్షించుకునేందుకు అలానే కదలకుండా ఉంటుంది. అయితే మనం గీత చెరిపేటప్పుడు కోడి ఫీలింగ్ ఎంటంటే... తాను చనిపోయినట్లు నటిస్తున్న కానీ తనని వదిలేరా లేరే.. ఇక లాభం లేదు ఎలాగైన వీళ్ల నుంచి తప్పించుకుందాం అని అనుకుంటుంది. ఇక ఎప్పుడైతే మనం గీత పూర్తిగా చెరిపెయ్యగానే.. అదే టక్కున పారిపోయేందుకు యత్నిస్తో్ంది. అదే ఈ వీడియో యొక్క రహస్యం. అయితే గత 1646లో మొదటిసారిగా ఇలాంటి ట్రిక్ ప్లే చేసి చూశారు. రోమ్‌లో అథనాసియస్ కిర్చెర్ ఇలా చేసినప్పుడు విజయం సాధించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories