పిల్లలకు ఉన్నతమైన విద్య అందించాలని ప్రతి తల్లిదండ్రులూ కలలు కంటారు. అయితే ఇంటర్ వరకూ చదివించిన తరువాత పై చదువులు చదివించడానికి ఎన్నో తిప్పలు పడాల్సి...
పిల్లలకు ఉన్నతమైన విద్య అందించాలని ప్రతి తల్లిదండ్రులూ కలలు కంటారు. అయితే ఇంటర్ వరకూ చదివించిన తరువాత పై చదువులు చదివించడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా దిగువతరగతి, మధ్యతరగతి ప్రజలకు ఈ కష్టాలు చాలా ఎక్కువ. అందుకే సాధారణంగా ఈ వర్గాల్లో ఆడపిల్లలకు ఇంటర్ తర్వాత చదువు ఆగిపోతుంది. అటువంటి వారికోసం కేంద్రప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆ పథకం పేరు ప్రతానమంత్రి విద్యాలక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్..
ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థికస్థోమత తక్కువగా ఉన్నవారు పైచదువులు చదివేందుకు ఈ లోన్ సదుపాయం చక్కగా ఉపయోగ పడుతుంది. ఇందులో 22 వేర్వేరు విద్యారుణాలున్నాయి.
ఈ రుణాన్ని ఎలా పొందాలో వివారాలివీ..
ఈ స్కీములో రుణం పొందేందుకు అర్హతలు
*ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి.
*విద్యార్థులు ఖచ్చితంగా భారతీయులై ఉండాలి.
*విద్యార్థుల తల్లీదండ్రులు ఆదాయ సర్టిఫికెట్స్ ఉండాలి.
లోన్ ఇలా అప్లై చేయాలి..
*ముందుగా.. www.vidyalakshmi.co.in వెబ్‌సైట్‌లో విద్యార్ధి/తల్లిదండ్రుల వ్యక్తిగత వివరాలు నింపాలి.
*మన వివరాలను బట్టి ఎంతవరకూ లోన్ పొందొచ్చో తెలుసుకోవచ్చు.
మన వివరాలు చూసి పరీక్షించిన బ్యాంకులు మనం లోన్ తీసుకునేందుకు అర్హులో.. కాదో తెలియజేస్తాయి.
*ఒకవేళ మనం అర్హులైతే నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌లో చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ హోల్డ్‌లో ఉంటే.. మన నుంచి బ్యాంక్ అదనపు వివరాలు కోరుతుందని అర్థం.
*ఆ సమయంలో ఏమైనా వివరాలు మనం పొందుపరిచామో లేదో ఒకసారి మళ్లీ చెక్ చేసుకోవాలి.
ఈ స్కీమ్‌లో ఆన్‌లైన్ పోర్టల్ కూడిన బ్యాంకులు ఇవీ..
SBI, IDBI, Bank of India, Canara Bank, Union Bank of India, Corporation Bank, Dena Bank, Punjab National Bank,Punjab and Sindh Bank,Oriental Bank of Commerce,Central Bank of India,Kotak Mahindra Bank,Vijaya Bank,Bank of Baroda,Andhra Bank,Federal Bank,HDFC Bank,ICICI Bank,Axis Bank, UCO Bank,Indian Bank,Bank of Maharashtra,Indian Overseas Bank,RBL Bank, Syndicate Bank,Abhyudaya Co-operative Bank Limited,DNS bank,Karur Vysya Bank,Tamilnad Mercantile Bank Ltd
ఇందులో విద్యార్థులకు ఓ అవకాశాన్ని కల్పిస్తున్నారు. పైన తెలిపిన బ్యాంకుల్లో ఒకే సారి మూడు బ్యాంకుల ద్వారా లోన్‌కి అప్లై చేయొచ్చు. అందులో ఏ బ్యాంకులో తక్కు వడ్డీ ఉంటే అందులోనుంచి తీసుకోవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire