Railway Facts: బైక్‌లో లీటర్‌ ఇంజిన్‌ ఆయిల్‌ చాలు.. కానీ ట్రైన్‌ ఇంజిన్‌లో ఎన్ని లీటర్లు పడుతుందంటే..?

How Much Engine Oil Has To Be Put In The Train Engine
x

Railway Facts: బైక్‌లో లీటర్‌ ఇంజిన్‌ ఆయిల్‌ చాలు.. కానీ ట్రైన్‌ ఇంజిన్‌లో ఎన్ని లీటర్లు పడుతుందంటే..?

Highlights

Railway Facts: భారతీయ రైల్వే వ్యవస్థ చాలా పెద్దది. ప్రతిరోజు లక్షల మందిని గమ్యస్థానాలకి చేరుస్తుంది.

Railway Facts: భారతీయ రైల్వే వ్యవస్థ చాలా పెద్దది. ప్రతిరోజు లక్షల మందిని గమ్యస్థానాలకి చేరుస్తుంది. అయితే రైళ్లలో ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు రెండు ఉంటాయి. లాగాల్సిన బరువును బట్టి వివిధ రకాల ఇంజిన్‌లని అమరుస్తారు. అయితే ఏ ఇంజిన్‌ అయినా సజావుగా నడవాలంటే ఆయిల్‌ అవసరమవుతుంది. బైక్ అయితే ఒక లీటర్‌ ఇంజిన్‌ ఆయిల్‌ సరిపోతుంది. కారులో 2 నుంచి 5 లీటర్లు పోస్తారు. కానీ టన్నుల కొద్ది బరువు లాగే రైళ్ల ఇంజిన్‌లలో ఎన్ని లీటర్ల ఆయిల్‌ పోస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రస్తుతం భారతీయ రైల్వేలలో WDs6, wdp 4, 4b, WDM 3 D, WDG3A, 4d, wdg 4 ఇంజిన్లని ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు రైలు కదలడానికి ముందు ఇంజిన్‌ ఆయిల్‌ని చెక్‌ చేస్తారు. వైరింగ్, లీకేజీలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తారు. దీనివల్ల ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కార్-బైక్‌ల మాదిరిగానే రైళ్ల ఇంజిన్‌లని కూడా సర్వీసింగ్‌ చేస్తారు. ఇందుకోసం వాటిని వర్క్‌షాప్‌కు పంపుతారు. ఇక్కడ ఇంజిన్ ఆయిల్‌ చెక్ చేసి మారుస్తారు.

అతి తక్కువ ఇంజన్ ఆయిల్ WDs6లో పోస్తారు. దాదాపు 530 లీటర్లు పోస్తారు. అతి ఎక్కువగా 1080 లీటర్ల ఇంజిన్ ఆయిల్ WDM 3 D, WDG3A క్లాస్ ఇంజిన్‌లలో పోస్తారు. మనం wdp 4, 4b, 4d, wdg 4 ఇంజిన్‌లు ఎక్కువ పవర్‌ని కలిగి ఉంటాయి. గూడ్స్ రైళ్లను లాగడానికి ఈ ఇంజిన్‌లని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల వీటి శక్తి ప్రకారం 1457 లీటర్ల ఇంజిన్ ఆయిల్‌ను పోస్తారు. అప్పుడే ఇది ఎటువంటి సమస్య లేకుండా పని చేస్తుంది. రైలును ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories