Traffic Challan: ఒక రోజులో ట్రాఫిక్ చలాన్‌ ఎన్నిసార్లు వేయవచ్చు.. ఈ తప్పులు చేయవద్దు..!

How Many times Traffic Challan can be issued in a day know Complete Information
x

Traffic Challan: ఒక రోజులో ట్రాఫిక్ చలాన్‌ ఎన్నిసార్లు వేయవచ్చు.. ఈ తప్పులు చేయవద్దు..!

Highlights

Traffic Challan: వాహనం నడిపే ప్రతి ఒక్కరు కచ్చితంగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి.

Traffic Challan: వాహనం నడిపే ప్రతి ఒక్కరు కచ్చితంగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి. లేదంటే రోడ్డు ప్రమాదాలకి కారణమవుతారు. దీనివల్ల మీకు మాత్రమే కాకుండా ఇతర వాహనదారులకి కూడా నష్టం జరుగుతుంది. అందుకే ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించినప్పుడు పోలీసులు సదరు వాహనదారుడికి చలాన్‌ వేస్తారు. అయితే ఒక రోజులో పదే పదే ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘిస్తే ప్రతిసారి చలాన్‌ పడుతుందా.. ఈ సందేహం చాలా మందిలో ఉంది. దీని గురించి ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం.

రోజులో ఒకసారి చలాన్‌ వేస్తే మళ్లీ మళ్లీ వేయరని వాహనదారులు అనుకుంటారు. అంతేకాదు చలాన్‌ పడింది కదా అని మళ్లీ మళ్లీ ట్రాఫిక్‌ ఉల్లంఘన చేయడానికి మొగ్గుచూపుతారు. నిజానికి రోజులో ఒకసారి చలాన్‌ పడితే మళ్లీ చలాన్‌ వేయరు. కానీ ఇది అన్ని సందర్భాలకి వర్తించదు. ఉదాహరణకు రోజులో ఒకసారి మీరు ట్రాఫిక్‌ నియమాన్ని ఉల్లంఘిస్తే చలాన్ జారీ అవుతుంది. మళ్లీ అదే నియమాన్ని ఉల్లంఘిస్తే చలాన్ జారీ కాదు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. మీరు పదే పదే అదే తప్పు చేస్తుంటే చాలా సార్లు చలాన్ జారీ అవుతుందని గుర్తుంచుకోండి.

హెల్మెట్ లేకుండా బైక్, స్కూటర్‌పై వెళుతున్నప్పుడు పోలీసులు చలాన్ జారీ చేస్తారు. తర్వాత మిమ్మల్ని రోజంతా వదిలివేస్తారు. ఇది కాకుండా మీరు మళ్లీ వేరే ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే దానికి మళ్లీ చలాన్‌ పడుతుంది. మీరు నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిసారీ రోడ్డుపై అమర్చిన కెమెరాల దృష్టికి వస్తుంది. ఓవర్ స్పీడ్, రెడ్ లైట్ క్రాసింగ్ వంటి చలాన్‌లు జారీ అవుతాయి. మీరు ఈ తప్పును మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తే రోజులో చాలాసార్లు చలాన్ జారీ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories