Indian Railway: రైలు కోచ్‌లో ఎన్ని టన్నుల ఏసీ ఉంటుందో తెలుసా? కౌంట్ తెలిస్తే బాప్‌రే అనాల్సిందే..!

How Many ACs and Tons are Installed in Train Coach Check Indian Railway Facts
x

Indian Railway: రైలు కోచ్‌లో ఎన్ని టన్నుల ఏసీ ఉంటుందో తెలుసా? కౌంట్ తెలిస్తే బాప్‌రే అనాల్సిందే..!

Highlights

Indian Railway: ప్రస్తుతం ఎండ వేడిమికి కూలర్లు కూడా చల్లదనాన్ని అందిచలేక ఇబ్బందులు పడుతున్నాయి.

Indian Railway: ప్రస్తుతం ఎండ వేడిమికి కూలర్లు కూడా చల్లదనాన్ని అందిచలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఏసీ మాత్రమే ఉపశమనం ఇస్తోంది. సాధారణంగా ఏసీ గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. అయితే 1000 నుంచి 1200 మంది ప్రయాణించే భారీ రైలులో ఎన్ని ఏసీలు అమర్చబడి ఉంటాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ACలు ఎక్కడ ఇన్‌స్టాల్ చేస్తారు? వాటి ఉష్ణోగ్రత ఎంత? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉన్న ప్రీమియం రైళ్లు కాకుండా, మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌లో మొత్తం కోచ్‌ల సంఖ్య 68534గా ఉంది. ఇందులో నాన్ ఏసీ స్లీపర్, జనరల్ కోచ్‌ల సంఖ్య 44946 కాగా, ఏసీ కోచ్‌ల సంఖ్య 23588లుగా ఉంది. ప్రీమియం రైళ్లు కాకుండా, ఇతర రైళ్లలో ఏర్పాటు చేసిన AC కోచ్‌లు కూడా ఉన్నాయి. ఈ కోచ్‌ల ద్వారా రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

ప్రతి కోచ్‌లో ఏసీల సంఖ్యను నిర్ణయించినట్లు భారతీయ రైల్వే సమాచార డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ తెలిపారు. వాటి సామర్థ్యాలు విభిన్నంగా విభజించారు. ఒక కోచ్‌లో రెండు ఏసీలు అమర్చారు. ఇవి రెండు చివర్లలో అమర్చబడి ఉంటాయి. ఒక కోచ్‌లో ఏడు టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలను అమర్చారు. కొన్ని రైళ్లలో 3.5-3.5 టన్నులుగా లేదా కొన్ని రైళ్లలో 4, 3 టన్నులుగా విభజించారు. ఈ విధంగా ఏడు టన్నుల AC మొత్తం కోచ్‌ను చల్లగా ఉంచగలదు. కోచ్ అంతటా శీతలీకరణను సమానంగా పంపిణీ చేయడానికి, ప్రతి కంపార్ట్‌మెంట్ పైన హోల్స్ ఉంటాయి. దీని కారణంగా అన్ని సీట్లలో ప్రయాణీకులకు AC చల్లదనం అందుతుంది.

ఇది కాకుండా, వాటి ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుంచి 24 డిగ్రీల మధ్య ఉంచబడుతుంది. థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటే వీటిలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కాబట్టి 22 డిగ్రీలు, సెకండ్, ఫస్ట్ ఏసీల్లో 24 డిగ్రీలు ఉంచుతుంటారు. అయితే, కొన్నిసార్లు ప్రయాణీకుల సౌకర్యాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories