Viral Video: మీరు వాడే తేనె అస‌లా.? న‌కిలీనా.. ఈ వీడియో చూసి తెలుసుకోండి..

Honey quality testing video goes viral in social media
x

Viral Video: మీరు వాడే తేనె అస‌లా.? న‌కిలీనా.. ఈ వీడియో చూసి తెలుసుకోండి.. 

Highlights

Viral Video: మీరు వాడే తేనె అస‌లా.? న‌కిలీనా.. ఈ వీడియో చూసి తెలుసుకోండి..

Viral Video: మార్కెట్లో ల‌భించే వ‌స్తువులు కొనుగోలు చేయాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. ఏదో అస‌లో, ఏది న‌కిలినో తెలియ‌ని రోజులు ఉన్నాయి. దీంతో ఏదైనా కొనుగోలు చేయాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించే ప‌రిస్థితి. మారుతోన్న కాలంతో పాటు న‌కిలీరాయుళ్లు కూడా కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ర‌క‌ర‌కాలుగా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. అస‌లు వ‌స్తువుల‌ను పోలిన‌ట్లు ఉండే న‌కిలీ వ‌స్తువుల‌ను తయారు చేస్తున్నారు.

పాల నుంచి కారం వ‌ర‌కు అన్నీ న‌కిలీ వ‌స్తువుల‌ను తయారు చేసి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. అందుకే ఏదైనా వ‌స్తువు కొనుగోలు చేసే దాని నాణ్య‌తను తెలుసుకొనే కొనుగోలు చేయాల‌ని చెబుతున్నారు. ముఖ్యంగా ఆహార ప‌దార్థాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అంటున్నారు. ఇలాంటి వాటిలో తేనె ఒక‌టి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తేనేను క‌ల్తీ చేసి కొంద‌రు కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప‌క్క విక్ర‌యించే తేనె విష‌యంలో మ‌న‌కు ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆ తేనె ఎంత వ‌ర‌కు మంచిద‌న్న డౌట్ ఉండే ఉంటుంది.

అయితే రోడ్డు ప‌క్క‌న విక్ర‌యించే తేనెను నాణ్య‌త‌ను తెలుసుకునేందుకు ఒక మంచి చిట్కా ఉంది. తాజాగా అందుకు సంబంధించి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఏంటా వీడియో.? ఆ వీడియో ద్వారా తేనె నాణ్య‌త‌ను ఎలా తెలుసుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం. నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియోలో ఓ వ్య‌క్తి.. రోడ్డు ప‌క్క‌న తేనెను విక్ర‌యిస్తున్నాడు. అదే స‌మ‌యంలో ఆ తేనె అస‌లా.? న‌కిలా.? అనే విష‌యాన్న తెలుసుకోవ‌డానికి అత‌ను ఒక ప్ర‌యోగం చేసి చూపించాడు.

ఇందుకోసం కొంత తేనెను తీసుకొని అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి టీష‌ర్ట్‌పై వేశాడు. అనంత‌రం ఆ తేనెను చేతితో తొల‌గించ‌గా.. ఆ తేనె మొత్తం తుడుచుకుపోయింది. ష‌ర్ట్‌కు ఏమాత్రం ప‌ట్టుకోలేదు. ఇలా ఏ తేనె అయితే పూర్తిగా తొల‌గిపోతుందో అదే మంచి తేనెగా భావించాలి. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు భ‌లే ఉంది ట్రిక్కు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories