ఉప్పు లేకుంటే భారతీయులకు ముద్ద దిగడం లేదు

ఉప్పు లేకుంటే భారతీయులకు ముద్ద దిగడం లేదు
x
Highlights

భారతదేశం లో వంటకాల పేర్లు వింటేనే అందరికి నోరు ఊరుతుంది. అది శాఖాహారమైన, మాంసాహారమైనా సరే. మన దేశ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. అయితే, మనం...

భారతదేశం లో వంటకాల పేర్లు వింటేనే అందరికి నోరు ఊరుతుంది. అది శాఖాహారమైన, మాంసాహారమైనా సరే. మన దేశ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. అయితే, మనం తీసుకునే ప్రతి వంటకం లోనూ ఉప్పు లేకపోతే రుచే ఉండదు. కాదు.. ఉన్నట్టనిపించదు. ఇవే వంటకాలు విదేశీయులకు వడ్డించినప్పుడు ఉప్పు తక్కువగానే వడ్డిస్తాం. మనం తినే తప్పుడు మాత్రం ఉప్పు గట్టిగానే తగిలిస్తాం. ఇదే మన ప్రత్యేకత.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం మన దేశంలో తలసరి ఉప్పు వాడకం రోజుకు 10 గ్రాములు. ప్రపంచ సరాసరి కన్నా ఇది నూరు శాతం ఎక్కువ. ప్రపంచ సగటు కేవలం 5 గ్రాములే. మనం పచ్చళ్ళు.. కూరలు.. ఇలా అన్నిటిలో తగినంత ఉప్పు లేకుంటే ఒప్పుకోము.

నిజానికి ఇది ఆందోళన కలిగించే అంశమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వాడకాన్ని 2023 వ సంవత్సరానికి 30 శాతం తగ్గించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇపుడు భారత్ లో ఉప్పు వాడకాన్ని తగ్గించే విషయం లో ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతోంది.

పదేళ్ల క్రితం వివిధ దేశాల్లో పెరుగుతున్న అనారోగ్య పరిస్థితుల పట్ల జరిపిన సర్వేలో దాదాపు చాలా వరకు వ్యాధులు అధిక ఉప్పు వాడకం వలనే వస్తున్నట్టు గుర్తించారు. దీంతో పలు అవగాహనా కార్యక్రమాలు రూపొందించి ఉప్పు వాడకాన్ని తగ్గించాలని ప్రచారం చేపట్టారు. ఈ క్రమం లో ఇటీవల 13 దేశాల్లో తిరిగి సర్వే చేశారు. ఈ సర్వే లో భారత దేశంలో వచ్చిన ఫలితాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయని సర్వ్ లో సభ్యుడు జార్జి ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియాలో పరిశోధనా సభ్యుడు సుధీర్ రాజ్ థౌట్ తెలిపారు. నిజానికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు. ఈ వివరాలన్నీ జర్నల్ ఆఫ్ క్లినికల్ హైపర్ టెన్షన్ లో ప్రచురితమయ్యాయి ఇప్పటికైనా మన దేశం లో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories