Love Marriage: లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..!

Have you got a Love Marriage Remember these things
x

Love Marriage: లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..!

Highlights

ప్రేమ వివాహ చిట్కాలు: లవ్‌ మ్యారేజెస్‌ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. కొంతమందికి ఇదొక డ్రీమ్‌.

Love Marriage: ప్రేమ వివాహ చిట్కాలు: లవ్‌ మ్యారేజెస్‌ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. కొంతమందికి ఇదొక డ్రీమ్‌. లవ్‌ మ్యారేజెస్‌ ప్రాచీన కాలంలో తక్కువగా జరిగేవి కానీ ఆధునిక కాలంలో ఇవి బాగా పెరిగిపోయాయి. అయితే లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నవారు తొందరగా విడిపోతారు అనే ఒక అపోహ చాలామందిలో ఉంది. దీనికి బలం చేకూర్చడానికి చాలా లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నవారు తొందరగా విడిపోతున్నారు కూడా. నిజానికి ప్రేమ వివాహం చేసుకున్నవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ముందుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి

పెళ్లికి ముందు, బాయ్‌ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌ కానీ పెళ్లి అయ్యాక భార్యభర్తలు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ముందుగ ఒకరినొకరు గౌరవించుకోవాలి. భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ స్నేహితులు, బంధువుల ముందు చులకనగా చేసి మాట్లాడకూడదు. ఒకరికొకరు గౌరవంగా సంబోధించుకోవాలి. లేదంటే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడానికి దారితీస్తుంది.

అబద్ధాలు చెప్పడం మానుకోండి

ప్రేమ అయినా పెళ్లి అయినా జీవిత భాగస్వామి పట్ల నిజాయితీగా ఉండటం అవసరం. అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ ఎక్కువ కాలం కొనసాగలేరు. మీరు రోజువారీ చేసిన పనుల గురించి మీ జీవిత భాగస్వామికి చెప్పడం అపవసరం. ఉదాహరణకు మీరు ఈ రోజు ఏ వ్యక్తిని కలుస్తున్నారు, సాయంత్రం ఇంటికి రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది తదితర విషయాలు షేర్‌ చేసుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది.

మితిమీరిన కోపం వద్దు..

చాలామంది పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోయిందని, మునుపటిలా నువ్వులేవని అంటుంటారు. దీనికి కారణం ఒకరిపై ఒకరు చూపించుకునే కోపం. పెళ్లికి ముందు మీరు ఇద్దరే కావొచ్చు కానీ పెళ్లయిన తర్వాత పిల్లలు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటి వల్ల కోపతాపాలు ఉండడం సహజం. కానీ ఈ విషయాలను ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. ఒకరిపై ఒకరు కోపం చూపించుకోకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories