Hyderabad People Survey: హైదరాబాద్లో సగం జీతం ఇంటి అద్దెలకే పోతోందట.. ఈ లెక్కలు తెలిస్తే షాక్ అవుతారు..!

Half of the salary is spent on house rent Surprising truths in the survey conducted on the people of Hyderabad
x

Hyderabad People Survey: హైదరాబాద్లో సగం జీతం ఇంటి అద్దెలకే పోతోందట.. ఈ లెక్కలు తెలిస్తే షాక్ అవుతారు..!

Highlights

Hyderabad People Survey: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఇంటి కిరాయిల ధరలు విపరీతంగా పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

Hyderabad People Survey: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఇంటి కిరాయిల ధరలు విపరీతంగా పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఒక సాధారణ ఉద్యోగి సగంజీతం అద్దె చెల్లించడానికి వెళ్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ‘ఇల్లు కటి చూడు పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు బహుశా ఈ రెండు పనులు ఎంత కష్టమో ఇప్పుడు చాలామందికి తెలిసివస్తుంది. అయితే దాదాపు మధ్యతరగతి ప్రజలే ఇంటి అద్దెల బారిలో పడుతున్నారని ఈ సర్వే చెబుతోంది. ఇటీవల ది గ్రేట్ ఇండియన్ వాలెట్ పేరిట ఓ శాస్త్రీయ సర్వే జరిగింది. భారత్ లోని 17 నగరాలకు చెందిన జీవన స్థితి గతులపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర వాసులపై హోమ్ క్రెడిట్ ఇండియా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

హైదరాబాద్ నగరంలో నివసించే వ్యక్తులు తమ ఆదాయంలో ఎక్కువగా ఇంటి అద్దెలకు, పిల్లల చదువులకు ఖర్చు చేస్తున్నారని తేలింది. 2023లో నెలవారి ఖర్చు 19 వేలు ఉండగా ఇప్పుడు 24 వేలకు చేరిందని సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్‌లో నివసించేవారి ఆదాయం 21 శాతం ఇంటి అద్దెలకే ఖర్చు అవుతోందని తేలింది. మరోవైపు పిల్లల చదువులకు 17 శాతం ఆదాయం ఖర్చు అవుతున్నట్లు నివేదిక తెలిపింది. ఇక ఫ్యామిలీ ట్రిప్స్ కు 35 శాతం, తిండికి 28 శాతం ఖర్చు చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

అలాగే సినిమాలు 19 శాతం, ఓటీటీ కోసం 10 శాతం, ఫిట్ నెస్ కోసం 6 శాతం ఖర్చు చేస్తున్నారని తేలింది. సిటిజన్స్‌కు 41 శాతం మందికి ఆన్‌లైన్ మోసాల గురించి తెలుసని, 27 శాతం మోసాల బారిన పడ్డారని సర్వేల్లో వెల్లడైంది. ఇదిలా ఉంటే పెరిగిన ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయని, సగం జీతం కిరాయిలకే పోతే కుటుంబంతో బతికేదెలా అని బాధపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories