Viral Video: బలముందని విర్రవీగితే, చివరికి మిగిలేది ఇదే.. వైరల్ వీడియో..!
Viral Video: 'పొట్టి వాడిని పొడుగువాడు కొడితే.. పొడుగువాన్ని పోశమ్మ' కొడుతుంది. ఇది తెలంగాణ సమాజంలో ఎక్కువగా ప్రస్తావించే సామెత.
Viral Video: 'పొట్టి వాడిని పొడుగువాడు కొడితే.. పొడుగువాన్ని పోశమ్మ' కొడుతుంది. ఇది తెలంగాణ సమాజంలో ఎక్కువగా ప్రస్తావించే సామెత. బలం ఉందని విర్రవిగితే ఎంతటి వారికైనా పరాభవం తప్పదు అనేది ఈ సామెత ముఖ్య ఉద్దేశం. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తుంటే ఇది అక్షర సత్యమనిపిస్తోంది. సాధారణం ఒక కొండ చిలువ ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం అప్పనంగా చుట్టేసి మింగేస్తాయి.
అయితే అంతటి బలవంతమైన కొండ చిలువను చిన్న చిన్న చీమలు చంపేస్తే.. ఊహించుకోవడానికి కూడా కష్టమే కదూ! అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ చీమల దండు ఏకంగా కొండ చిలువను మాయం చేసేసింది. కలిసికట్టుగా పోరాడితే శత్రువు ఎంత పెద్దవాడైనా సరే ఎదుర్కోవచ్చనే గొప్ప సందేశాన్ని ఇస్తోందీ వీడియో.
ఇంతకీ వీడియోలో ఏముందనేగా.. చీమల గుంపు ఉన్న చోటుకు పెద్ద కొండ చిలువ వచ్చింది. దీంతో ఆ కొండచిలువపై చీమలన్నీ కలిసి దాడికి దిగాయి. ఆ కొండచిలువను పై నుంచి కింద వరకు చీమలు చుట్టుముట్టాయి. ఈ చీమలను వదిలించుకోవడం కొండచిలువకు సాధ్యం కాలేదు. చివరకు ఆ చీమల దాడిలో ఆ కొండచిలువ హతమైంది. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 'ప్రకృతి మనకు చెప్పేది ఇదే.. ఏ జీవినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఒక జీవి కంటే ఓ సమూహం ఎప్పుడూ బలమైనది' అని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న 'బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి' అనే సుమతి శతక పద్యం అక్షరాల నిజం అనిపిస్తుంది.
Snake invades ant territory and gets pulverized!
— Figen (@TheFigen_) September 16, 2024
Nature tells us;
never underestimate any living creature, the community is stronger than one ...pic.twitter.com/4dj55fVVHF
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire