Treatment after Diagnosis of Fever: జ్వర నిర్ధారణ తర్వాతే చికిత్స.. సలహా ఇస్తున్న ప్రభుత్వం

Treatment after Diagnosis of Fever: జ్వర నిర్ధారణ తర్వాతే చికిత్స.. సలహా ఇస్తున్న ప్రభుత్వం
x
Treatment after Diagnosis of Fever
Highlights

Treatment after Diagnosis of Fever: అసలే కరోనా... జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో అనారోగ్యం వస్తే... అవి ఏ వ్యాధికి చెందిన లక్షణాలో ముందు తెలుసుకోవాలి.

Treatment after Diagnosis of Fever: అసలే కరోనా వైరస్... జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో అనారోగ్యం వస్తే... అవి ఏ వ్యాధికి చెందిన లక్షణాలో ముందు తెలుసుకోవాలి... అలా కాకుండా వాటికి తగ్గట్టు మన ఇష్టం వచ్చినట్టు మాత్రలు వేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఆ వ్యాధి తగ్గకపోగా కొత్త సమస్య పుట్టుకొస్తుంది. అందుకే ఈ సమయంలో జ్వరాలు రావడం సహజమేనని, వాటికి సంబందించి పూర్తిస్థాయిలో వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందడం ఉత్తమమని సూచిస్తున్నారు. అలా కాకుండా సొంత వైద్యంతో ముందుకు పోతే భవిషత్తు పరిణామాలను తట్టుకోవడం కష్టమవుతుందని వివరిస్తున్నారు.

జ్వర లక్షణాలను బట్టి స్వీయ చికిత్సలు తీసుకోవడం ఏమాత్రం ఆచరణీయం కాదని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలం కాబట్టి మలేరియా, డెంగీ జ్వరాలొస్తుంటాయి. వీటి లక్షణాలను బట్టి మందులు వాడటం సరికాదని, ఏ జ్వరమైనా వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ చేసుకోవడం ముఖ్యమంటున్నారు. కొన్నిసార్లు కరోనా వైరస్‌ వల్ల వచ్చే జ్వరం సైతం ఇలాంటి లక్షణాలనే పోలినప్పుడు ఆ మందులు వాడి వదిలేస్తే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

► చలి జ్వరంతో కూడిన లక్షణాలుంటే మలేరియా అయ్యే అవకాశం ఉంది.

► ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే ర్యాపిడ్‌ డయాగ్నిస్టిక్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా నిర్ధారించుకోవచ్చు.

► డెంగీ వస్తే.. తీవ్ర జ్వరంతో పాటు కళ్ల వెనుక నొప్పి, శరీరంపై దద్దుర్లు వస్తాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలో ఐజీజీ, ఐజీఎం పరీక్ష నిర్వహిస్తారు.

► ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే ఎలీశా టెస్ట్‌కు రిఫర్‌ చేస్తారు. ఈ పరీక్షలు పెద్దాస్పత్రుల్లోనే జరుగుతాయి.

కరోనా వైరస్‌కు సంబంధించి దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటాయి.

► గొంతు లేదా ముక్కులోంచి తేమను తీసి పరీక్ష నిర్వహిస్తారు.

► మలేరియా, డెంగీ జ్వరాలొచ్చినప్పుడు కరోనా రాదన్న నిబంధనేదీ లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories