Google search trends August 2020: నెట్టింట్లోనూ.. దాని గురించే సెర్చ్

Google search trends August 2020: నెట్టింట్లోనూ.. దాని గురించే సెర్చ్
x

గూగుల్ సెర్చ్  

Highlights

Google search trends August 2020: క‌రోనా .. ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న‌మ‌హ‌మ్మారి. ప‌ల్లె, ప‌ట్ట‌ణమ‌నే తేడా లేకుండా త‌న పంజా విసురుతుంది. ఈ ప‌రిణామంలో లాక్ డౌన్ అనివార్య‌మైంది

Google search trends August 2020: క‌రోనా .. ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న‌ మ‌హ‌మ్మారి. ప‌ల్లె, ప‌ట్ట‌ణమ‌నే తేడా లేకుండా త‌న పంజా విసురుతుంది. ఈ ప‌రిణామంలో లాక్ డౌన్ అనివార్య‌మైంది. దీంతో యువ‌త ఎక్కువ‌గా నెట్టింట్లో గ‌డుపుతున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్, యూట్యూబ్‌ల‌లో స‌ర్చింగ్ చేవారి సంఖ్య పెరిగింది. మ‌రో వైపు ఆన్‌లైన్ షాపింగ్‌, ఓటీటీలకు కూడా బాగా గిరాకీ పెరిగిదంట‌. అయితే, ఈ క‌రోనా విప‌త్కాలంలో.. చాలా మంది గూగుల్‌లో ఏం వెతికారనే ప్ర‌శ్న‌కు.. అనే ఆస‌క్తి క‌ర స‌మాధానాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. గ‌త‌నెల‌ ఆగష్టులో గూగుల్‌లో అత్యధికంగా ఏం వెతికారు అనే విషయాలను గూగుల్ వెల్లడించింది.

ఈ జాబితాలో ఎక్కువ మంది.. పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్, రష్యా వాక్సిన్- స్పుత్నిక్ వి వాక్సిన్ గురించి చాలా మంది వెతికారని తెలిపింది. మరోవైపు బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి గురించి కూడా బాగా అన్వేషించారని చెప్పింది. అలాగే క‌రోనా వ్యాక్సిన్ ను ఎవ్వ‌రు త‌యారు చేస్తున్నారు. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుంది? కరోనా లక్షణాలు ఎన్ని రోజులకు కనిపిస్తాయి?

అంతేకాకుండా భారత స్వాతంత్య్ర దినోత్సవం గురించి, ఫోన్‌లో వస్తోన్న కరోనా కాలర్ ట్యూన్‌ను ఎలా ఆపాలి, అమిత్ షాకు కరోనా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా, బట్టలపై కరోనా ఎంతకాలం జీవించి ఉంటుంది, కరోనా వైరస్ భారత్‌లో ఎప్పుడు ముగుస్తుంది, కరోనా లక్షణాలు, ఎస్పీఅ బాలుకు కరోనా తదితర అంశాల గురించి నెటిజన్లు బాగా వెదికారని వివరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories