ఆరోగ్యానికి తీయటి నేస్తం చెరకురసం

ఆరోగ్యానికి తీయటి నేస్తం చెరకురసం
x
Highlights

వేసవిలో రకరకాల పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటాం. వాటిలో చెరకురసం ఒకటి. ఎండగా ఉన్న సమయంలో ఒక్క గ్లాసు చేరకురసం తాగితే ఎక్కడలేని సత్తువ వచ్చేస్తుంది....

వేసవిలో రకరకాల పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటాం. వాటిలో చెరకురసం ఒకటి. ఎండగా ఉన్న సమయంలో ఒక్క గ్లాసు చేరకురసం తాగితే ఎక్కడలేని సత్తువ వచ్చేస్తుంది. చెరకురసం తక్కువ ఖర్చు తో ఎక్కువ ప్రయోజనాన్ని కలగజేస్తుంది. దాహాన్ని తీర్చడమే కాకుండా తక్షణం శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది చెరకురసం.

వేసవి కాలంలో తరచుగా, మన శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ చెమట రూపంలో అధికంగా కోల్పోవడం జరుగుతుంటుంది. క్రమంగా శరీరం డీహైడ్రేషన్ సమస్యలకు గురవ్వడం, అధిక మొత్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుముఖం పట్టడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వేసవిలో ఈ పరిస్థితులను అధిగమించడానికి సరైన పరిష్కారంగా చెరకు రసం ఉంటుంది.

అందరికీ తెల్సింది ఇదొక్కటే. కానీ, చెరకురసంతో ఇంకా చాలా లాభాలున్నాయనే విషయం చాలా మందికి తెలీదు. సాధారణంగా చెరకురసం తీయగా ఉంటుందనే ఒక కారణంగానే చూస్తారు. కానీ, ఇందులో ఎన్నో బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి. బరువు పెరగడానికి ముఖ్య కారణం కొవ్వు. కొవ్వు అధికంగా ఉన్న ఆహారపదార్థాలతో వచ్ఛే సమస్య ఇది. చెరకులో అసలు కొవ్వు పదార్థాలుండవు. అందుకే చెరకును ఎంత తిన్నా కొవ్వు పెరిగే అవకాశమే ఉండదు. బరువు పెరగకుండా చెరకు ఉపయోగపడుతుంది అనడానికి ఇదో కారణం.

చెరకులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అంటే ఫైబర్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. అందువల్ల చెరకు తీసుకోవడంతో ఆకలి మందగించి ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేము. దానితో అనవసరంగా బరువు పెరిగే పరిస్థితి రాదు. ముడి చెరకు రసంలో అధికంగా 13 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుందని చెబుతారు.

చెడు కొలెస్ట్రాల్ చెరకులో అసలు ఉండదు. కొలస్ట్రాల్ ఉండదని చెప్పాకా చేదు కొలెస్ట్రాల్ ఉండదనే ప్రశ్నే లేదు కదా. కానీ, చెరకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

ఆరోగ్యకరమైన ప్రేవులు మరియు జీర్ణ వ్యవస్థ, బరువు తగ్గడంతో ముడిపడి ఉంటుంది. ప్రేగు కదలికలను మెరుగుపరిచేందుకు, మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు మరియు శరీరంలో ఆమ్ల తత్వాలను తగ్గించేందుకు, మరియు గుండెలో మంటను తగ్గించుటకు ఎంతగానో సహాయం చేస్తుంది. దీనికి కారణం, దీనిలో ఉండే ఫైబర్ నిక్షేపాలే. క్రమంగా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించేందుకు, ఆయుర్వేదంలో కూడా చెరకు రసాన్ని సిఫార్సు చేయడం జరిగింది.

చెరకు రసం శరీరంలో విషతుల్య పదార్ధాలను రసాయనాలను తొలగించి నిర్విషీకరణ గావిస్తుంది. క్రమంగా శరీరంలోని అసంబద్దమైన చెడు కారకాలను విసర్జించడంలో కీలకపాత్ర పోషిస్తూ, చెడు కొలెస్ట్రాల్ తగ్గుదలలో సహాయం చేస్తూ, మంచి జీవక్రియలను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మీకు, చెరకు రసం గురించి ఒక అవగాహన వచ్చింది కదా. శరీరానికి తక్షణ శక్తిని అందించే క్రమంలో భాగంగా ఇతర కృత్రిమ చక్కెరలు కలిపిన పానీయాలు, ఆహార పదార్ధాల మీద ఆధారపడే కన్నా, చెరకు రసం తీసుకోవడం మూలంగా అద్భుతమైన లాభాలను పొందవచ్చు. కాని మధుమేహం వంటి, చక్కెర ఆధారిత దీర్ఘకాలిక సమస్యలతో భాద పడేవారు మాత్రం, వైద్యుని సలహా పాటించడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories