Viral Video: బండరాయిని పగలకొట్టి చూడగా అద్భుతం.. ఇంతకీ ఎలా సాధ్యమైందబ్బా.?

Gold treasure found inside of the rock video goes viral in social media
x

Viral Video: బండరాయిని పగలకొట్టి చూడగా అద్భుతం.. ఇంతకీ ఎలా సాధ్యమైందబ్బా.? 

Highlights

గుప్త నిధుల గురించి చాలా సార్లు వినే ఉంటాం. అయితే ఇవి నిజంగానే ఉన్నాయా.? లేదా.?అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది.

మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా.. ఇప్పటికీ చేధించలేని ఎన్నో ప్రశ్నలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. వీటిలో అసలు ఇప్పటికీ కొన్నింటి గురించి మనకు తెలిసి కూడా ఉండనివి ఉన్నాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతీ రోజూ ఇలాంటి వీడియోలు ఏదో ఒకటి నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

గుప్త నిధుల గురించి చాలా సార్లు వినే ఉంటాం. అయితే ఇవి నిజంగానే ఉన్నాయా.? లేదా.?అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా గుప్త నిధులు భూమి లోపల లంకె బిందల్లో ఉంటాయని చాలా మంది భావిస్తుంటాం. అయితే బండ రాయి లోపల బంగారం లభిస్తే.? ఇదేదో కథల్లో మాత్రమే సాధ్యమవుతుందని అనుకుంటున్నారు కదూ! కానీ నెట్టింట దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో ఓ ట్రెజర్‌ హంటర్‌ బండ రాయిని పగలగొట్టాడు. బండరాయి కూర్చుని దానిని రౌండ్ షేప్‌లో చెక్కాడు. అచ్చంగా ఒక మూతలా రాయిపై భాగాన్ని బయటకు తీశాడు. అందులో ఏముందో అని చూడగా.. కొన్ని బంగారు నాణేలు కనిపించాయి. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఫేక్‌ వీడియో అంటూ కొందరు స్పందించారు. ఎవరో కావాలనే ఇలా డిజైన్‌ చేశారని భావిస్తున్నారు. అయితే వీడియో మాత్రం తెగ ట్రెండ్ అవుతోంది. దాదాపు ఈ వీడియోను 7 లక్షలకుపైగా మంది వీక్షించారు. ఆ రాయిలో నిధి ఉందన్న విషయం అసలు ఎలా తెలిసిందంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories