Gionee M30: 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో జియోనీ నుండి అదిరేపోయే స్మార్ట్‌ఫోన్

Gionee M30: 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో జియోనీ నుండి అదిరేపోయే స్మార్ట్‌ఫోన్
x

Gionee M30 Features

Highlights

Gionee M30: జియోనీ స్మార్ట్ ఫోన్ల‌ ప్ర‌పంచంలో ఓ సంచ‌ల‌నం సృష్టించింది. సాధార‌ణంగా స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ అంటే.. 4000 ఎంఏహెచ్, 4500 ఎంఏహెచ్ ఉంటుంది. ఆ తర్వాత 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లు

Gionee M30: జియోనీ స్మార్ట్ ఫోన్ల‌ ప్ర‌పంచంలో ఓ సంచ‌ల‌నం సృష్టించింది. సాధార‌ణంగా స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ అంటే.. 4000 ఎంఏహెచ్, 4500 ఎంఏహెచ్ ఉంటుంది. ఆ తర్వాత 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌నం దానికే భారీ బ్యాట‌రీ.. అని అనుకునే వాళ్లం. ఏడాదిగా సాంసంగ్ ఏకంగా 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది.

కానీ ఇప్పుడు జియోనీ .. ఎటువెళ్లినా ప‌వ‌ర్ బ్యాంక్ అవసరం లేకుండా.. ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో జియోనీ ఎం30 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. అది కూడా 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అది కూడా త‌క్కువ‌ బ‌డ్జెట్ లో అందుబాటులో రావ‌డం‌ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ. స్మార్ట్ ఫోన్ ఒక 6 అంగుళాల HD + ఎల్సిడి స్క్రీన్ తో వుంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో పి 60 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఈ ఫోన్ కేవలం 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ సింగిల్ వేరియంట్ తో మాత్రమే వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో రెండు కెమెరాలు మాత్రమే ఉంటాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక కెమెరా ఉంది మరియు మరొకటి ముందు భాగంలో వుంటుంది. జియోనీ ఎం 30 స్మార్ట్ ఫోన్ లో మీకు 8 ఎంపి ఫ్రంట్ కెమెరాతో పాటు 16 MP వెనుక కెమెరా మాత్రమే లభిస్తుంది. మీరు ఈ మొబైల్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా చూడవచ్చు.

జియోనీ ఎం30 స్పెసిఫికేషన్స్:

డిస్‌ప్లే: 6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ

స్టోరేజ్: 8జీబీ+128జీబీ

ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ60

రియర్ కెమెరా: 16 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

బ్యాటరీ: 10,000ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

ధర: సుమారు రూ.15,000

Show Full Article
Print Article
Next Story
More Stories