Indian Railway: సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల మధ్య వ్యత్యాసం ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా? తేడా ఇదే..!

From Superfast To Express Trains Check Here Difference In Speed And Haunting
x

Indian Railway: సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల మధ్య వ్యత్యాసం ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా? తేడా ఇదే..!

Highlights

Superfast and Express Trains: భారతదేశంలో చాలా మంది ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి రైళ్లను ఉపయోగిస్తుంటారు. సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మధ్య తేడా ఎలా ఉంటుందో ఇప్పుడు తెసుకుందాం?

భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్, indianrailways.gov.in ప్రకారం, రైలు వేగం మేజర్ లైన్‌లో గంటకు 55 కిలోమీటర్లు, బిజీ మార్గంలో గంటకు 45 కిలోమీటర్లు ఉంటే దానిని సూపర్ ఫాస్ట్ రైలుగా పరిగణిస్తారు.

అంటే, ఆ రైలుకు సూపర్ ఫాస్ట్ హెడ్ ఛార్జీ విధిస్తారు. అయితే, కొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఈ రైళ్ల ప్రత్యేకత ఏమిటంటే వాటికి చాలా తక్కువ స్టాపేజ్‌లు ఉంటాయి. అంటే, ఒకటి రెండు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి.

ఎక్స్‌ప్రెస్ రైలు భారతదేశంలో పాక్షిక ప్రాధాన్యత కలిగిన రైలుగా పేరుగాంచింది. ఈ రైళ్ల వేగం గంటకు 55 కిలోమీటర్లుగా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ రైలు వేగం మెయిల్ రైలు కంటే ఎక్కువ అయితే, అది సూపర్‌ఫాస్ట్ రైలు కంటే తక్కువ వేగంతో వెళ్తుంది.

మెయిల్ రైలు వంటి వివిధ ప్రదేశాలలో ఎక్స్‌ప్రెస్ రైలు హాల్ట్ ఉండదు. ఎక్స్‌ప్రెస్ రైలు పేరు ఎక్కువగా నగరం, ప్రదేశం లేదా వ్యక్తి పేరు నుంచి నిర్ణయిస్తుంటారు. ఇందులో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయి.

గంటకు ఒక పరిమిత సగటు వేగంతో నడిచే రైళ్లను మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్లు అంటారు. ఈ రైలు సహాయంతో చాలా దూరం ప్రధాన నగరాలను కవర్ చేస్తుంటారు. మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైలు వేగం సూపర్‌ఫాస్ట్ కంటే తక్కువగా ఉంటుంది.

ఈ రైలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. చాలా చోట్ల ఆగుతుంది. చాలా సార్లు ఆగిపోతుంది కూడా. చాలా మెయిల్-ఎక్స్‌ప్రెస్ నంబర్‌లు 123తో ప్రారంభమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories