ఫ్రిడ్జ్ లో వీటిని ఉంచుతున్నారా.. అయితే..

ఫ్రిడ్జ్ లో వీటిని ఉంచుతున్నారా.. అయితే..
x
Highlights

ప్రస్తుత కాలంలో చాలమంది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఫ్రిడ్జ్‌లో ప్రతి కూరగాయలను, పండ్లను అందులో పెడుతుంటారు. చాలమంది ముందుగానే ఫుడ్ రెడీ చేసుకుని పాడవకుండ ఉండేందుకు.. అందులో ఉంచుకుని మళ్ళీ వేడి చేసుకుని తినడం చేస్తుంటారు.

ప్రస్తుత కాలంలో చాలమంది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఫ్రిడ్జ్‌లో ప్రతి కూరగాయలను, పండ్లను అందులో పెడుతుంటారు. చాలమంది ముందుగానే ఫుడ్ రెడీ చేసుకుని పాడవకుండ ఉండేందుకు.. అందులో ఉంచుకుని మళ్ళీ వేడి చేసుకుని తినడం చేస్తుంటారు. అయితే కొన్ని కూరగాయలు ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు.. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* చాల మంది ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోయడం చేస్తుంటారు. అలా చేయటం ద్వారా వాటిని మళ్ళీ వంట చేయడానికి ఉపయోగించాలని వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతాంరు. దీనివల్ల కట్ చేసిన ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది. అందుకే తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టవద్దంటున్నారు నిపుణులు.

* ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో బంగాళాదుంపలను పెట్టకండి. బంగాళాదుంపలు చల్లటి ప్రదేశంలో ఉంటే .. అందులో చక్కెర శాతం ఎక్కువగా పెడుగుతుంది. దీనివల్ల కూరలో రుచి మారుతుంది. అందుకే బంగాళాదుంపలను వంటగదిలోనే ఉంచుకోవడం మంచిది.

* ఇక ఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం ఉందంటే.. అది తేనె అని చెప్పాలి. తేనెను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల.. తేనె యొక్క రుచి మారుతుంది. అందుకే తేనెను ఫ్రిడ్జ్ లో అసలు పెట్టవద్దు. తేనె ని అల్మారాలో లేక ఇంట్లో భద్రమైన ప్రదేశం లో పెట్టుకోవటం బెటర్.

* ఇక చాలమంది అరటి పండ్లని ఫ్రిడ్జ్ లో ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల అరటిలో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి. దీంతో అరటి పండ్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అరటి పండ్లని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

* ఫ్రిడ్జ్‌లో పువ్వులని అసలు పెట్టకూడదు. ఎందుకంటే వీటి వాసన వల్ల ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహారాల పైన ప్రభావం పడుతుంది. దీంతో ఆ పూల వాసనతో ఇతర ఆహారాలని తినలేరు. అందుకే వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచకండి.

* ఎక్కువ మంది మార్కెట్ నుండి తీసుకువచ్చిన టమోటోలను ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. దీనివల్ల చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా టమోటోలు త్వరగా పండిపోయే అవకాశం ఉంది మరియు అంతకుముందు ఉండే రుచిని కోల్పోవడం జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

* చాల మంది బ్రెడ్ పాకెట్ ఓపెన్ చేసాక మిగిలిపోయినది ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల బ్రెడ్ గట్టి పడి తినలేని స్థితికి వస్తుంది. అందుకే కవర్ మూసి బ్రెడ్ ను ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

* తెలుగు వారు పచ్చళ్ళు ఎక్కువగా పెడతారు. ఇక ఇవి చెడిపోకుండా ఉండటానికి చాల మంది ఫ్రిడ్జ్ లో పచ్చళ్ళు పెట్టడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చల్లదనాన్ని ఊరగాయలు వంటి పచ్చళ్ళు త్వరగా చెడిపోతాయి. ఊరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన రుచి కూడా పోతుంది. అయితే సూర్యకాంతి పడకుండా ఊరగాయ, ఆవకాయలను ఇంట్లో ఉంచడం వలన రెండు మూడేళ్ళ పాటు పాడవ్వకుండా ఉంటాయి. మంచి నూనె ఉపయీగించి బాగా తయారు చేసిన ఊరగాయలు చెయ్యి పెట్టకుండా గరిటె వాడితే బాగానే ఉంటాయి.

* మన శరీర రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో అసలు ఉంచకండి. ఫ్రిడ్జ్ లో ఉంచిన వెల్లులి ఆహారంలో వాడినా ఫలితం ఉండదు. ఎందుకంటే చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా ఇందులో ఉండే రుచి మరియు సువాసన పోతుంది. ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన వెల్లులి కుళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories