Viral: శృంగారం కోసం పాటల పోటీ, నచ్చకపోతే మరణ శిక్షే.. ఈ కప్పల తీరే వెరైటీ.. !

Female Frogs From Australia Eat up Male Frogs if They Don
x

ఇమేజ్ క్రెడిట్ (డాక్టర్ జాన్ బౌల్డ్)

Highlights

Viral: ఈ సృష్టిలో ఇప్పటికీ మానవుడికి తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి.

Viral: ఈ సృష్టిలో ఇప్పటికీ మానవుడికి తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. ప్రదేశాలు మొదలు, జంతు జాతుల వరకు ఇంకా వెలుగులోకి రాని ఎన్నో నిజాలు, వింతలు ఉన్నాయి. వీటి అన్వేషణ కోసం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఓ వింత విషయాన్ని కనుగొన్నారు. ఓ ఆడజాతి కప్ప జీవనశైలికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి ఉత్తరంగా ఉండే కూరగాంగ్‌ ద్వీపంలోని అడవుల్లో విచిత్రమైన ఆడ కప్ప వివరాలను పరిశోధకులు గుర్తించారు. ఈ జాతిలోని ఆడ కప్పలు ఆకుపచ్చ రంగులో, మగ కప్పలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. అయితే సహజకార్యమైన శృంగారం కోసం ఈ ఆడజాతి కప్పలు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాయి. విచిత్రమనే కంటే భయంకరమని చెప్పాలి. ఎందుకనేగా మీ సందేహం.

సంతానోత్పత్తిని పెంపొందించుకునేందుకు గాను ఆడ కప్పలు.. మగ కప్పల కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన మగ కప్పను వెతుక్కోవడానికి ఒక పాటల పోటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో తమకు నచ్చినట్లు పాటలు పాడిన మగ కప్పను మెచ్చి శృంగారంలో పాల్గొంటాయి. ఒకవేళ ఆ మగ కప్ప పాట నచ్చలేదో ఇక అంతే సంగతులు, దాన్ని అమాంతం నోటితో నమిలి మింగేస్తుంది. అందుకే ఈ జాతి ఆడ కప్పలను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కప్పగా ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన న్యూకాజిల్ యూనివర్సిటీకి చెందిన జీవావరణ శాస్త్రజ్ఞుడు డాక్టర్ జాన్ బౌల్డ్ తెలిపారు.

ఇంతకీ పరిశోధకులు ఈ విషయాన్ని ఎలా కనిపెట్టారంటే. కూరగాంగ్ ద్వీపంలోని అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన కప్ప జాతి ఆడ కప్పల సంతతి ఎక్కువ ఉన్నా, మగ కప్పల జనాభా మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో అసలు ఏం జరుగుతోందన్న దానిపై పరిశోధకులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అసలు విషయం బయటపడింది. మగ కప్పల కంటే ఆడకప్పల శరీరం, నోరు పెద్దదిగా ఉండడంతో ఇలా సులభంగా మింగేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories