ప్రతి ఒక్కరి వేలిముద్ర ప్రత్యేకమే..! చేయి కాలితే, గాయమైతే ఆ ముద్రల సంగతేంటి..?

Everyones Fingerprint Is Unique If the Hand is Burnt or Injured What are the Impressions | Telugu Online News
x

ప్రతి ఒక్కరి వేలిముద్ర ప్రత్యేకమే..! చేయి కాలితే, గాయమైతే ఆ ముద్రల సంగతేంటి..?

Highlights

Fingerprint: చేతి వేలి ముద్రలు ఎప్పుడైనా గమనించారా.. అవి అందరికి ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి...

Fingerprint: చేతి వేలి ముద్రలు ఎప్పుడైనా గమనించారా.. అవి అందరికి ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. ఎవరికివారే ప్రత్యేకం. అందుకే సంతకాల దగ్గర, పాస్‌వర్డ్‌ల దగ్గర వీటిని ఉపయోగిస్తారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ చేయి కాలిపోతే, ఏదైనా గాయమైతే పరిస్థితి ఏంటి.. ఆ ముద్రలు అలాగేఉంటాయా.. లేదా పోతాయా.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

వేలిముద్ర ఎందుకు ప్రత్యేకమైనది.. ఒక వ్యక్తి వేలిముద్ర ఎందుకు సరిపోలడం లేదు.. దీనిపై వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ ఎం. కాన్లీ మాట్లాడుతూ.. మానవ జన్యువులు, పర్యావరణం వంటి అనేక అంశాలు దీని వెనుక దాగి ఉన్నాయి. ప్రతి ఒక్కరి వేలిముద్రలు భిన్నంగా ఉండటానికి ఇలాంటి అనేక అంశాలు కారణమవుతాయని చెప్పారు.

బిడ్డ కడుపులో ఎదుగుతున్నప్పుడే వేలిముద్రను సిద్ధం చేసే ప్రక్రియ మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవ చర్మం రెండు పొరలతో ఉంటుంది. మొదటిది - బాహ్యచర్మం. రెండోది- అంతర చర్మము. ఈ రెండూ కలిసి పెరుగుతాయి. మానవ జన్యువుల ప్రకారం ఈ రెండు పొరల నుంచి వేలిముద్రలు తయారై ఉబ్బెత్తుగా ఏర్పడటం ప్రారంభమవుతాయి.

వేళ్లలో ఏదైనా సమస్య వచ్చి వేలిముద్ర మాయమైతే కొన్ని నెలల వ్యవధిలోనే మళ్లీ అదే స్థితిలో కనిపిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఉదాహరణకు ఎవరికైనా చేయి కాలితే దానిపై యాసిడ్ పడినా లేదా గాయమైనా దాదాపు ఒక నెలలో వేలిముద్ర అదే స్థలంలో మళ్లీ వస్తుంది. ఒక వ్యక్తి వేలిముద్ర వయస్సుతో మారుతుందా అనే ప్రశ్న కూడా చాలామందిలో మెదులుతుంది. చిన్న వయసులోనే వేలిముద్రలో మార్పు ఉంటుందని శాస్త్రం చెబుతోంది. కానీ ఒక వ్యక్తి వయస్సు పెరిగేకొద్దీ అది కఠినంగా మారుతుంది కానీ వేలిముద్ర నిర్మాణంలో ఎటువంటి మార్పు ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories