ఎకో ఫ్రెండ్లీ పటాకులు, తగ్గనున్న సౌండ్‌,ఎయిర్‌ పొల్యూషన్‌

ఎకో ఫ్రెండ్లీ పటాకులు, తగ్గనున్న సౌండ్‌,ఎయిర్‌ పొల్యూషన్‌
x
Highlights

దీపావళి వచ్చిందంటే ఏ ఇంట్లో అయినా టపాసులు మోత మోగాల్సిందే.. రకరకాల బాణాసంచా కాల్చుతూ పండుగ జరుపుకుంటాం. కానీ ఈ సారి దీపావళి క్రాకర్స్‌ పరిశ్రమల్లో...

దీపావళి వచ్చిందంటే ఏ ఇంట్లో అయినా టపాసులు మోత మోగాల్సిందే.. రకరకాల బాణాసంచా కాల్చుతూ పండుగ జరుపుకుంటాం. కానీ ఈ సారి దీపావళి క్రాకర్స్‌ పరిశ్రమల్లో గ్రీన్‌ రెవెల్యూషన్‌ రావడంతో సౌండ్స్‌కు గుడ్‌బై చెప్పి సైలెంట్‌ సెలబ్రేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. శబ్దం వస్తుంది కానీ పొగ రాదు. అసలు విషయమేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

కెమికల్స్‌‌తో పటాకులు తయారు చేసిన పలు కంపెనీలు సుప్రీం ఆదేశాలతో ఇప్పుడు గ్రీన్‌‌ క్రాకర్స్‌‌ వైపు రూటు మార్చాయి. ఎకో ఫ్రెండ్లీ, తక్కువ సౌండ్‌‌ చేసే పటాకులను సిద్ధం చేస్తున్నాయి. భీకరమైన ధ్వనులతో దడ పుట్టించే రాకెట్లు, బాంబులు, చెవులు చిల్లులు పడకుండా ముక్కులు, నాడీవ్యవస్థ నాశనం కాకుండా తలనొప్పేరాని గ్రీన్‌‌ క్రాకర్స్‌‌ త్వరలో మార్కెట్‌‌లోకి రానున్నాయి. ఇప్పటికే రాజస్టాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పరిశ్రమలు గ్రీన్‌ క్రాకర్స్‌ని తయారు చేస్తున్నాయి.

పొల్యూషన్‌, సౌండ్‌ లేని క్రాకర్స్‌తో పండగ జరుపుకోవాలని... ఆలాంటి టపాసులు తయారయ్యే ఫార్మూలాను రూపొందించాల్సిందిగా ఢిల్లీలోని నేషనల్‌ ఎన్విరాల్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సుప్రీకోర్టు ఆదేశించింది. దీంతో పొల్యూషన్‌ లేని ఓ ఫార్మూలాను తయారు చేసింది. మామూలుగా బాణాసంచా తయారు చేసేటప్పుడు బేరియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. అలా కాకుండా... జియోలైట్‌ ద్వారా గ్రీన్‌ క్రాకర్స్‌ను తయారు చేశారు. వీటిని కాల్చినప్పుడు... వెలుతురు తప్ప విషవాయువులు వెలువడవు కనుక... సాధారణ క్రాకర్స్‌తో పొలిస్తే 70 శాతం తక్కువ హానికరం కాదని నిపుణులు చెబుతున్నారు.

కొత్తగా తయారు చేస్తోన్న గ్రీన్‌ క్రాకర్స్‌లో సేఫ్‌ వాటర్ రిలీజర్ , సేఫ్ మినిమమ్ ఆల్యుమినియమ్ , సేఫ్‌ థెర్మైట్‌ క్రాకర్స్‌ అందుబాటులో ఉన్నాయి. మిగతా టపాసుల్లాగానే ఇవి కూడా శబ్దం, కాంతి విషయంలో సమానంగా ఉంటాయని... కాకపోతే ఎలాంటి హానికారక రసాయన పొగలను విడుదల చేయవని సైంటిస్టులు అంటున్నారు. హై ప్రెషర్‌తో నీటిని విడుదల చేసే బాంబులు, అత్యంత ప్రకాశ వంతంగా వెలుగులీనే రాకెట్లు వంటి వాటిని శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇలాంటి క్రాకర్స్‌ కాల్చడం వల్ల చాలా వరకు పొల్యూషన్‌ను అరికట్టే ఛాన్స్‌ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే... ఈ గ్రీన్ క్రాకర్స్ ఈ దీపావళికి అందుబాటులో రాలేదని... వచ్చేఏడాది దివాలి కల్లా మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి.

గ్రీన్‌క్రాకర్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది కస్టమర్స్‌ నిషేధించిన క్రాకర్స్‌ కావాలని కోరుతుంటే... మరి కొందరు మాత్రం సౌండ్‌లేని క్రాకర్స్‌ సకాలంలో సరఫరా కాకపోవడంతో మరికొందరు నిరాశపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories