Viral Video: డాక్టర్లను దేవుళ్లు అనేది ఇందుకే.. అచేతనంగా పుట్టిన బిడ్డకు..

Viral Video: డాక్టర్లను దేవుళ్లు అనేది ఇందుకే.. అచేతనంగా పుట్టిన బిడ్డకు..
x

Viral Video: డాక్టర్లను దేవుళ్లు అనేది ఇందుకే.. అచేతనంగా పుట్టిన బిడ్డకు..

Highlights

Viral Video: మతం, కులం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ చేతులెత్తి మొక్కోది ఒక్క వైద్యుడికి మాత్రమే.

Viral Video: మతం, కులం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ చేతులెత్తి మొక్కోది ఒక్క వైద్యుడికి మాత్రమే. దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మను ఇస్తాడని చెబుతుంటారు. నిజంగా ఇది అక్షర సత్యం. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న వారికి కూడా ప్రాణం పోసే శక్తి ఒక్క డాక్టర్‌కు మాత్రమే ఉంటుంది. దీనికి సాక్ష్యంగా నిలుస్తూ ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డాక్టర్‌కు హ్యాట్సాప్‌ చెబుతున్నారు.

ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఓ బిడ్డ అచేతనంగా జన్మించింది. ఆ చిన్నారిలో కొంచెం కూడా కదలికలేదు. దీంతో చనిపోయిన బిడ్డ పుట్టిందని అంతా బాధపడుతున్నారు. అయితే ఎలాగైనా ఆ బిడ్డను బతికించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శిశువును.. మరో గదికి పరుగుపరుగున తీసుకొచ్చారు. అనంతరం శిశుకు కృత్రిమ శ్వాస అందించేందుకు నోటిపై పరికరం పెట్టి శ్వాస అందించాడు.

అలాగే ఛాతిపై మెల్లగా ఒత్తుతూ చిన్నారి తనంతట తానుగా శ్వాసతీసుకునేలా ప్రయత్నం చేశారు. కాసేపు స్పందించని చిన్నారి, ఆ తర్వాత క్రమంగా శ్వాసతీసుకోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత వెంటనే చిన్నారి ఏడుపు ప్రారంభించింది. దీంతో అక్కడున్న వారంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ డాక్టర్‌ దేవుడి రూపంలో వచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దేవుడు ఎక్కడో లేడని ఇలాంటి వైద్యుల రూపంలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఏకంగా 14 లక్షల వ్యూస్‌ రావడం విశేషం.


Show Full Article
Print Article
Next Story
More Stories