Hallmark: హాల్‌ మార్కింగ్‌ గురించి మీకు ఈ విషయం తెలుసా..?

Do You Know This Thing about Hallmarking 1-26 Lakh Jewellers Registered for Gold Hallmarking | Telugu Online News
x

Hallmark: హాల్‌ మార్కింగ్‌ గురించి మీకు ఈ విషయం తెలుసా..?

Highlights

Hallmark: హాల్‌ మార్క్‌ గుర్తు అంటే స్వచ్ఛతకు మారుపేరు. ఈ గుర్తులేనిదే ఏ బంగారం వ్యాపారి నగలు అమ్మరాదు కొనరాదు...

Hallmark: ఒకప్పుడు బంగారం వ్యాపారులు షాపునకు వచ్చిన వినియోగదారులను మోసగించి నాసిరకం బంగారం అంటగట్టి అక్రమంగా దోచుకునేవారు. ఈ విషయం జనాలు తెలుసుకునేసరికి చాలా రోజులు గడిచేవి. కానీ ఇప్పుడు అలాకాదు. ప్రభుత్వం బంగారు నగలకు హాల్‌ మార్క్‌ని ప్రవేశపెట్టింది.

హాల్‌ మార్క్‌ గుర్తు అంటే స్వచ్ఛతకు మారుపేరు. ఈ గుర్తులేనిదే ఏ బంగారం వ్యాపారి నగలు అమ్మరాదు కొనరాదు. ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్నిప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో ఆమోదించింది. నవంబర్ 30 వరకు దేశంలోని 1.26 లక్షల మంది నగల వ్యాపారులు హాల్‌మార్కింగ్ కోసం తమను తాము నమోదు చేసుకున్నారు.

ప్రభుత్వం ఇటీవల గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఇప్పుడు అన్ని బంగారు ఆభరణాలు హాల్‌మార్కింగ్ హామీతో విక్రయిస్తారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్ని ఆభరణాలకు హాల్‌మార్కింగ్ చేశారో కూడా ప్రభుత్వం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశంలో, కేంద్ర ఆహార సహాయ మంత్రి అశ్విని చౌబే లోక్‌సభలో గోల్డ్ హాల్‌మార్కింగ్ గురించి సమాచారాన్ని అందించారు.

ఈ ఏడాది నవంబర్ 30 వరకు దేశంలో 1.26 లక్షల మంది ఆభరణాలు హాల్‌మార్కింగ్ కోసం నమోదు చేసుకున్నారని చెప్పారు. జూలై 1 నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 4.29 కోట్ల బంగారు ఆభరణాలు హాల్‌మార్క్ చేసినట్లు అశ్విని చౌబే పార్లమెంటుకు తెలియజేశారు.

ప్రభుత్వం జూన్ 23 నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. దీనిని వివిధ దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశగా, ప్రభుత్వం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 256 జిల్లాలను గుర్తించింది. ఇక్కడ గోల్డ్ హాల్‌మార్కింగ్ నియమం తప్పనిసరిగా వర్తిస్తుంది. జనవరి 15, 2021 నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనను తప్పనిసరి చేశామని అశ్విని చౌబే లోక్‌సభలో తెలిపారు.

కానీ కరోనా మహమ్మారి దృష్ట్యా జూన్ 1 నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఆ రోజు నుంచి గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి అని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉంది. అయితే దేశవ్యాప్తంగా కాకుండా వివిధ జిల్లాల్లో దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories