Indian Railways: బోగీలపై కనిపించే WR, CR, ER, NR పదాల అర్థం ఏంటో తెలుసా? రైలు జాతకమే చెప్పేయోచ్చు..!

Do you know the Meaning of the Words WR, CR, ER, NR Found on Trains
x

Indian Railways: బోగీలపై కనిపించే WR, CR, ER, NR పదాల అర్థం ఏంటో తెలుసా? రైలు జాతకమే చెప్పేయోచ్చు.

Highlights

మీరు రైల్వేలో ప్రయాణించేటప్పుడు, రైల్వే కోచ్ నంబర్‌లతో పాటు ఆంగ్ల అక్షరాలు కూడా పక్కనే కనిపిస్తుంటాయి.

Indian Railways: భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు. భారతీయ రైల్వేలు ఆర్థికంగానే కాకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రతిరోజు లక్షల మంది ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. ఒక గమ్యం నుంచి మరొక గమ్యానికి చేరుకోవడానికి, ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు. టికెట్ బుక్ చేసినప్పుడు, మీకు రైల్వే కోచ్‌లో బెర్త్ నంబర్ ఇస్తుంటారు. బెర్త్ నంబర్ ఉన్నట్లే.. కోచ్‌కి కూడా ఓ నంబర్ ఉంటుంది. కోచ్ నంబర్‌తోపాటు కొన్ని ఆంగ్లం, హిందీ అక్షరాలు కనిపిస్తుంటాయి. ఈ అక్షరాల అర్థం మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు రైల్వేలో ప్రయాణించేటప్పుడు, రైల్వే కోచ్ నంబర్‌లతో పాటు ఆంగ్ల అక్షరాలు కూడా పక్కనే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా WR, CR, ER, NR పదాలు ఎక్కవగా కనిపిస్తుంటాయి. అయితే, చాలా మంది వాటిని ఇంగ్లీషులో గానీ, హిందీలో గానీ అర్థం చేసుకోలేరు. వాస్తవానికి, ఈ పదాల అర్థం రైల్వే విభాగాలు చెంది ఉంటాయి. అంటే పశ్చిమ రైల్వే, తూర్పు రైల్వే (E), సెంట్రల్ రైల్వే (M), దక్షిణ రైల్వే (S), ఉత్తర రైల్వే (NR) అన్నమాట. అయితే, ఇది కాకుండా, రెండు దిశల మధ్య వచ్చే దిశ కోసం రైల్వే కోచ్ కూడా ఉంది. ఉదాహరణకు ఈశాన్య రైల్వే (NE)గా పేర్కొంటుంటారు.

పై సమాచారం నుంచి మీరు రైల్వేలలో ఇచ్చిన సంఖ్యలు, పదాల అర్థాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, మీరు తదుపరిసారి రైల్వేలో ప్రయాణించేటప్పుడు, మీ కోచ్‌ని చూసి, అది ఏ డివిజన్‌కు చెందినదో తెలుసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories