Indian Railways: రైలు లోపల ఫ్యాన్ పక్కనే రంధ్రాలు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే..!

Do you Know Holes Beside the Fans Inside the Train Check Here Indian Railway Facts
x

Indian Railways: రైలు లోపల ఫ్యాన్ పక్కనే రంధ్రాలు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే..!

Highlights

Indian Railways Passenger: రైలులో ప్రయాణించినప్పుడు లోపల చాలా ఫ్యాన్‌లను అమర్చడం చూసే ఉంటారు. అయితే, ఆ ఫ్యాన్ పక్కనే చాలా రంధ్రాలు ఉండడం మీరు గమనించే ఉంటారు. చాలా మంది ఈ విషయాన్ని విస్మరిస్తారు.

Indian Railways Facts: రైలులో ప్రయాణించినప్పుడు లోపల చాలా ఫ్యాన్‌లను అమర్చడం చూసే ఉంటారు. అయితే, ఆ ఫ్యాన్ పక్కనే చాలా రంధ్రాలు ఉండడం మీరు గమనించే ఉంటారు. చాలా మంది ఈ విషయాన్ని విస్మరిస్తారు. కానీ, దాని వెనుక కారణం ఏమిటో తప్పక తెలుసుకోవాలి. రైలులో ఫ్యాన్ పక్కన లాటిస్ ఆకారం ఉంటుంది. దీనిని రూఫ్ వెంటిలేటర్ అని పిలుస్తారు. దీని ఉపయోగం చాలా ప్రత్యేకమైనది. వేడి గాలి ఎప్పుడూ పైకి వెళ్తుందని శాస్త్ర నియమం చెబుతుంది. రైలులో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, అందులో వేడి గాలి ఏర్పడుతుంది.

ఫ్యాన్ పక్కనే రంధ్రాలు ఎందుకు ఉంటాయి?

ఇటువంటి పరిస్థితిలో రైలు లోపల వేడి గాలి కంపార్ట్మెంట్ పైభాగానికి వెళుతుంది. ఈ కారణంగా, దానిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ గాలిని బయటకు తీయడానికి, ఫ్యాన్ పక్కనే రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. గాలిని తొలగించడానికి రైలు పైన చిన్న ఖాళీలు ఉంచుతారు. ఇది రైలుపై కప్పబడి ఉంటుంది. తద్వారా వర్షం సమయంలో నీరు లోపలికి రాదు. దీనిని రూఫ్ వెంటిలేటర్ సిస్టమ్ అంటారు. అయితే, ఇంతకుముందు రైలులో ఉపయోగించిన లైట్లు, ఫ్యాన్స్ ఇంట్లోనూ వాడుకోవడానికి అనుకూలంగా ఉండేవి. ఈ క్రమంలో రైలులోని ఫ్యాన్లు, లైట్లు దొంగిలించి ఇళ్లకు తీసుకెళ్లడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇలాంటి వాటిని నివారించేందుకు రైలు లోపల 110 వోల్ట్ DC కరెంట్‌తో నడిచే ఫ్యాన్లు, లైట్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. వీటిని ఇంట్లో ఉపయోగించలేరు. రైలు కింద బ్యాటరీ బాక్స్ ఉంటుంది. దాని ద్వారా రైలు లోపల ఫ్యాన్లు, బల్బులు వెలుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories