దేవరగట్టు ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు. విజయదశమి నాడు మాల మల్లేశ్వరస్వామి సాక్షిగా కర్రల సమరం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ ఆటవిక సాంప్రదాయంతో తీవ్ర గాయాల పాలు కావడమే కాకుండా మ్రత్యువాత కూడా పడ్డారు. అయితే దీని పై మీడియా ఫోకస్ చేయడం, ఆనోటా ఈనోటా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించింది.
దేవరగట్టు ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు. విజయదశమి నాడు మాల మల్లేశ్వరస్వామి సాక్షిగా కర్రల సమరం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ ఆటవిక సాంప్రదాయంతో తీవ్ర గాయాల పాలు కావడమే కాకుండా మ్రత్యువాత కూడా పడ్డారు. అయితే దీని పై మీడియా ఫోకస్ చేయడం, ఆనోటా ఈనోటా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించింది. కర్రల సమరాన్ని నివారించేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో భాగంగానే ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికే ముందే దేవరగట్టు ఉత్సవంలో పాల్లొనే గ్రామాలపై పోలీసులు దండయాత్ర చేసేవారు. తమ కనుచూపులో కనపడే ప్రతి కర్రను సేకరించేవారు. గ్రామస్థులకు పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేసేవారు. 30 గ్రామాల పర్యటించి కర్రల సమరానికి దూరంగా ఉండాలని కర్రలతో కాకుండా సాంప్రదాయబద్దంగా పండుగను నిర్వహించుకోవాలని అవగాహన సదస్సులను నిర్వహించేవారు. ముఖ్యంగా నెరనికి, నెరనికితండా, కొత్తపేట, ఎల్లార్తి, ఆలూరు,హరికెరతాండ ఈ ఏడు గ్రామాల పై ప్రధాన ద్రుష్టి సారించేవారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కర్రలు స్వాధీనం చేసుకున్న గ్రామస్థులను ఎంత హెచ్చరించినా విజయదశమి రోజు వేల కర్రల-తో ప్రత్యక్షమవ్వడం పరిపాటిగా మారింది.
దేవరగట్టు ఉత్సవాలు ఎలా మొదలైందనే విషయంపై స్థానికంగా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఉండే కొండల మధ్య పూర్వం మునులు తపస్సు చేస్తూ ప్రశాంతంగా జీవనం గడిపేవారు. వీరికి అతి సమీపంలోనే మణి , మల్లాసుర అనే రాక్షులు కూడా నివాసం ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అడ్డుకునే వారు. రాక్షసుల వికృత చేష్టలను భరించలేకపోయిన మునులు తమను కాపాడాలంటూ పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటారు. పార్వతీదేవి గంగిమాలమ్మ రూపంలో ప్రత్యక్షమై రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడిస్తుంది. రాక్షసులు చచ్చేముందు తమ చివరి కోరికగా తమకు నర బలులు సమర్పించాలని కోరుకుంటుంది.అందుకు అమ్మ అంగీకరించక పోవటంతో కనీసం ఐదు చుక్కల రక్తమైనా ఇవ్వాలని ప్రాధేయపడగా పార్వతీదేవి అంగీకరిస్తుంది. రాక్షస సంహారం విజయదశమి రోజున జరగడంతో ప్రతి ఏటా దేవరగట్టు పై పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తుంటారు.
దసరా వచ్చిందంటే చాలు రాష్ర్ట వ్యాప్తంగా అందరి దృష్టి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు వైపే ఉంటుంది.విజయదశమి రోజున అర్ధరాత్రి దేవరగట్టు కొండల్లో ఉత్సవ మూర్తులను తీసుకెళ్లేందుకు 3 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు పోటీపడే దృశ్యాన్నితిలకించేందుకు లక్షలాది మంది వస్తారు. దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండల్లో వెలసిన మాలమల్లేశ్వర స్వామి వద్ద బన్ని ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు కర్రలు ధరించి కాగడాల వెలుతురులో నిర్వహించే ఊరేగింపు కొన్నిసార్లు గగుర్పాటు కలిగిస్తుంది.దసరా రోజున అర్ధరాత్రి జరిగే ప్రధాన ఘట్టం జైత్రయాత్ర. హోళగుంద మండలంలోని అరికెర, నెరణికి, నెరణికి తాండ తదితర గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు కర్రలు చేతపట్టుకుని కాగడాల వెళుతురులో జైత్రయాత్రలో పాల్గొంటారు.
ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడే దృశ్యాలు కనువిందు చేస్తాయి. కర్రలు చేత ధరించి ఒకరకమైన శబ్బం చేస్తూ వెళ్లే దృశ్యాలు ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లు కనిపిస్తాయి. స్వామి మాకే దక్కాలి.. అంటూ కాదు మాకే నంటూ 3 గ్రామాల ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చివిచక్షణా రహితంగా కర్రలతో కొట్టుకోవడం అనేది స్థానికుల దృష్టిలో వినోద క్రీడ.
అందుకే ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాది మంది సాయంత్రమే తరలివచ్చి కొండలపై కాస్త జాగా దక్కించుకుని తెల్లవార్లు జాగరణ చేసి మరీ ఉత్సవాలను తిలకిస్తారు. ఇక మీడియాలో హడావిడి సరేసరి.
ఎక్కడైనా దసరా వచ్చిదంటే కొన్ని రోజుల ముందు నుండి ఇంటి శుద్ది చేసుకుని పూజలు నిర్వహిస్తుంటారు..కాని దేవర గట్టు లో మాత్రం నెరనికి,నెరనికి తండా,కొత్త పేట గ్రామస్తులు మాళ మల్లేశ్వరుడికి కంకణ దారణ జరిగిన తర్వాత వాటి పై ద్రుష్టి పెడతారుదసరా ఉత్సవాలు ప్రారంభమైన 5వ రోజు చతుర్దసి నాడు స్వామి వారి.ఉత్సవ విగ్రహానికి కంకణ ధారణ చేస్తారు ఆ రోజు నుండి ఈ మూడు గ్రామాల్లోని ప్రజలు కఠిన ఉపవాసాలు వుంటారు ఎంత మద్య,మాంస ప్రియులైనా కంకణ ధారణ జరిగిన రోజు నుండి తొమ్మిది రోజుల పాటు అత్యంత నియమ నిష్టలతో సంసార సుఖాన్ని సైతం త్యజించి ఉప వాసాలతో కఠిన నేలపై పడుకుంటారు కులాలకు, మతాలకు అతీతంగా తమ ఇల్లు వాకిలిని సున్నాలతో మత పరిథిలో సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటారు కూర్మ రూపంలో వున్న మాల మల్లేశ్వరుడు ప్రతీది గమనిస్తాడని నియమ నిష్టలతో వున్న వారి కోరికలు నిండుగా ఫలిస్తాయన్నది గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం
దేవరగట్టులో విజయదశమి పర్వదినాన అర్ధరాత్రి సమయం నుంచి జైత్రయాత్ర కొనసాగుతుంది. పూర్వం కొండలపై విద్యుత్ సౌకర్యం లేక దివిటీలతో కొండపైకి వెళ్లే వారు. విష పురుగులు, అడవి జంతువుల బారి నుండి రక్షణ పొందేందుకు కాగడాలు, దివిటీల,కర్రలు వెలుతురులో మారణాయుధాలు చేత ధరించి వెళ్లే వారు. ఇప్పుడు విద్యుత్ సౌకర్యం కల్పించినా దివిటీలు, కాగడాలు ఉండాల్సిందేనని స్థానికులు అంటున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
విజయ దశమి రోజున రాత్రి స్వామి వారి కళ్యాణోత్సవం మొదలు ఉత్సవ మూర్తులను సింహాసనం కట్టమీద అధిష్టించే వరకు జరిగే కార్యక్రమాలన్నింటినీ కలిపి బన్ని ఉత్సవంగా పేర్కొంటారు. కళ్యాణోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. తెల్లవారు జామున శమీ పూజ, ఉదయం తెల్లవారిన తర్వాత బసవన్న కట్ట వద్ద ఆల య పూజారితో భవిష్య వాణి ఉంటాయి.
దీనిపై ప్రత్యేక ద్రుష్టి సారించిన కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కిరప్పా ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు విజయదశమి రోజు మాలమల్లేశ్వరస్వామి కల్యాణాన్ని, ఆ తరువాత జరిగే బన్ని ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చాడు. అందుకు కర్రలను కూడా ఉపయోగించుకోవచ్చని అనుమతి కూడా ఇచ్చాడు. అయితే కర్రలకు ముందు భాగంలో ఉపయోగించే రింగ్ లు ఉండకూడదని హెచ్చిరించారు. ఒకవేళ మితిమీరి ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు.మరోవైపు ఆలూరు నుంచి దేవరగట్టు వరకు వెళ్లే రహదారిలో భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.కర్రల సమరం వద్దు వాటి వల్ల కలిగే నష్టాలను పెద్ద పెద్ద అక్షరాలతో అందరిలో ఓ కొత్త ఆలోచనను రేపే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో విచ్చల విడిగా దొరికే నాటుసారా పై ఉక్కుపాదం మోపాడు. మద్యం దుకాణదారులను హెచ్చరించాడు. ప్రతి ఊరిలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ పెద్దలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించాడు. మరణాలు సంభవిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, చిన్న గాయాలు కూడా కాకుండా చూసుకునే బాద్యత గ్రామ పెద్దలపై పెట్టాడు. ఆనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే హింసకు చోటిచ్చే ఇటువంటి కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో గత రెండు సంవత్సరాల నుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.మరో వైపు బన్నీ ఉత్సవంలో శ్రుతిమించి ప్రవర్తించే వారిని సీసీ కెమెరాల ద్వారా డ్రోన్ ద్వారా మానిటర్ చేసి ఇ ఉత్సవాల తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 600 మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సాంప్రదాయ బద్దంగా జరిగే కర్రల సమరం ఆట విడుపుగానే ఉండాలని కానీ ఆటవికంగా ఉండి ఇతరులను గాయపరిచే విదంగా ఉండకూడదు అని చెపుతున్నారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా బన్నీ ఉత్సవాలు నిర్వహించుకుంటారని హెచ్ఎంటీవీ సైతం ఆశిస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire