One India One Ticket: 'వన్ ఇండియా వన్ టికెట్' వచ్చేసింది.. రైలు టిక్కెట్‌తో పాటు మెట్రో టోకెన్ బుక్ చేసుకునే ఛాన్స్..

delhi metro and irctc launched one india one ticket check uses
x

One India One Ticket: 'వన్ ఇండియా వన్ టికెట్' వచ్చేసింది.. రైలు టిక్కెట్‌తో పాటు మెట్రో టోకెన్ బుక్ చేసుకునే ఛాన్స్..

Highlights

One India One Ticket: 'వన్ ఇండియా వన్ టికెట్' వచ్చేసింది.. రైలు టిక్కెట్‌తో పాటు మెట్రో టోకెన్ బుక్ చేసుకునే ఛాన్స్..

One India One Ticket: భారతదేశంలోని రైల్వే, మెట్రో రెండింటిలోనూ ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ వచ్చింది. వన్ ఇండియా వన్ టికెట్ అనే అద్భుతమైన సదుపాయాన్ని రైల్వే శాఖ ప్రారంభించింది. అంటే దీనితో ఇప్పుడు రైలు, మెట్రో టిక్కెట్లు రెండింటినీ చాలా నెలల ముందుగానే బుక్ చేసుకోవచ్చు. దీంతో ప్రయాణం చాలా సులభం అవుతుంది. IRCTC, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయాణికుల కోసం ఈ సౌకర్యాన్ని ప్రారంభించాయి. అయితే, త్వరలోనే దేశమంతా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.

భారతీయ రైల్వేలు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిరంతరం ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సౌకర్యాలను తీసుకువస్తున్నాయి. ఇప్పుడు ఈ క్రమంలో IRCTC, DMRC సంయుక్తంగా వన్ ఇండియా వన్ టికెట్‌ను ప్రారంభించాయి. రైల్వే ప్రధాన మార్గం, అక్కడ కనెక్ట్ చేసిన మెట్రో ద్వారా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఈ సదుపాయం ప్రారంభించబడింది.

వన్ ఇండియా వన్ టికెట్ కింద, ప్రయాణీకులు IRCTC ద్వారా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకున్నట్లే, వారు ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అదే సమయంలో ఢిల్లీ మెట్రో టిక్కెట్‌లను బుక్ చేసుకోగలరు. ఇక విశేషమేమిటంటే, ఢిల్లీ మెట్రో క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ టోకెన్ బుక్ చేసుకున్న వెంటనే ప్రయాణీకుల ఆన్‌లైన్ రైలు టికెట్‌పై కనిపిస్తుంది. తద్వారా మెట్రో రైలు క్యూఆర్ కోడ్‌ను రికార్డ్ చేసి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించవచ్చు. ఇలా చేస్తే రైలు నుంచి దిగిన తర్వాత ప్రయాణికులు మెట్రోలో టికెట్ తీసుకోవడానికి ప్రత్యేక లైన్‌లో నిలబడాల్సిన అవసరం ఉండదు. బదులుగా, బుక్ చేసిన టిక్కెట్‌తో ప్రయాణం సులభం అవుతుంది.

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇచ్చిన సమాచారంలో, ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత మెట్రో టిక్కెట్లను 120 రోజుల ముందుగానే అంటే 4 నెలల ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తదుపరి 4 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. తద్వారా రైలు ఆలస్యంగా వచ్చినా ఈ టికెట్ వృథా కాకుండా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories