కరోనా వైరస్ ఎలా పుట్టిందో తెలుసుకోవాలనుందా?

కరోనా వైరస్ ఎలా పుట్టిందో తెలుసుకోవాలనుందా?
x
Representational Image
Highlights

కరోనా వైరస్ ఎక్కడో చైనాలో పుట్టి ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తుంది. ఇలాంటి వైరస్ గురించిన విషయాలు క్షణ్ణంగా తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

కరోనా వైరస్ ఎక్కడో చైనాలో పుట్టి ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తుంది. ఇలాంటి వైరస్ గురించిన విషయాలు క్షణ్ణంగా తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అసలు కరోనా వైరస్ అంటే ఏమిటి? కోవిడ్ 19 అంటే ఏమిటి ? ఎలా పుట్టింది ? వైరస్ తయారవడానికి కారణం ఏమిటి ? అనే సందేహాలు చాలా మందిలో ఒచ్చే ఉంటాయి. అలాంటి సమయంలో తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినపుడు మాత్రం నిర్ధిష్టమైన సమాచారం అందడంలేదు. సోషల్ మీడియాలో దాని గురించి వంద రకాలుగా చెబుతున్నారు. అవన్ని చదివినా, చూసినా బుర్ర పాడవుతుందే కానీ అసలైన విషయం బయటికి రావడంలేదు.

సరిగ్గా అలాంటి ఆలోచనే భారతీయ సైంటిస్టులకి కూడా కలిగినట్టుంది.అందుకే వైరస్ గురించి పూర్తిగా తెలుసుకుని, మిగతావారు తెలుసుకోవడానికి ఓ వెబ్‌సైట్ ని ప్రారంభించారు. ఆ వెబ్ సైటే కొవిడ్ జ్ఞాన్ (https://covid-gyan.in/). ఇందులో కరోనాకు సంబంధించిన పూర్తి విషయాలు క్షణ్ణంగా ఉంటాయి. దీని ద్వారా కరోనా వైరస్‌‌పై శాస్త్రీయమైన, నమ్మదగిన, కచ్చితమైన సమాచారం లభిస్తుంది. కరోనా వైరస్ కు సంబంధించిన ఫోటోలు, డేటా, వీడియోలూ కూడా ఈ సైట్ లో భద్రపరిచారని చెబుతున్నారు. ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా ఈజీగా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.



వాటితో ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఉన్న వెబ్ సైట్లలో వైరస్ కి సంబంధించి సమాచారం కూడా ఇచ్చారు. అంతే కాదు వైరస్ ప్రస్తుతం ఏలాంటి పరిస్థితుల్ని కలగజేస్తుంది. అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనే విషయాలని ఎప్పటికప్పుడు ఇందులో షేర్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. దీంతో సోషల్ మీడియాలో ప్రసారమయ్యే అసత్య కథనాలకు చెక్ పెట్టవచ్చని చెపుతున్నారు. ఇక ఈ సైట్ ని భారత్‌లోని ప్రముఖ శాస్త్ర విజ్ఞాన సంస్థలు అన్నీ కలిసి రూపుదిద్దాయి. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టాటా మెమోరియల్‌ సెంటర్‌లు ఈ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories