'కరోనా కాలర్ ట్యూన్' వాయిస్ ఈమెదే!

కరోనా కాలర్ ట్యూన్ వాయిస్ ఈమెదే!
x
Highlights

ఇప్పటికీ మనకు రైల్వే స్టేషనుకు వెళితే మనకు అర్ధం కాదు... విశాఖ వెళ్లినా, తిరుపతి వెళ్లినా, హైదరాబాదు వెళ్లినా చివరకు ఢిల్లీ వెళ్లినా అదే గొంతు వినిపిస్తుంటుంది.

ఇప్పటికీ మనకు రైల్వే స్టేషనుకు వెళితే అర్ధం కాదు... విశాఖ వెళ్లినా, తిరుపతి వెళ్లినా, హైదరాబాదు వెళ్లినా చివరకు ఢిల్లీ వెళ్లినా అదే గొంతు వినిపిస్తుంటుంది.ఏ స్టేషనులో విన్నా ఒకలాంటి గొంతే వినబడుతుంది...ఇవన్నీ ఒక్కరే పలికినా దేశమంతటా ఎలా? ఇవన్నీ చెప్పేవారొక్కరే.

కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. 'కోవిడ్-19 జాగ్రత్త చర్యల' కాలర్ ట్యూన్ వస్తుంది. ఇంకా ఈ వ్యాధి తొలి రోజుల్లో అయితే పొడి దగ్గుతో కాలర్‌ ట్యూన్ మొదలయ్యేది. ఈ కాలర్ ట్యూన్ విని మొదట అందరూ షాక్‌కి అయ్యారు. ఇటీవల టెలికాం సంస్థలు దగ్గుకు సంబంధించిన ఆడియో భాగాన్ని కత్తిరించాయి. దీంతో ఈ ట్యూన్ ఇప్పుడు నిమిషం పాటు వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని తెలుగు కాలర్‌ట్యూన్ మార్మోగుతుంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందర్నీ హెచ్చరిస్తూ.. జాగ్రత్తలు చెబుతున్న ఆ గొంతు ఎవరిదో తెలుసా? సమాజ హితాన్ని కోరుతూ తయారు చేసిన ఈ కాలర్ ట్యూన్ కు తన వాయిస్ అందించారు విశాఖపట్నానికి చెందిన పద్మావతి.

తాజాగా ఈ కరోనా కాలర్ ట్యూన్ గురించి పద్మావతి మాట్లాడుతూ.. ''నాకు కాలర్ ట్యూన్‌ని హిందీలో ఇచ్చారు. దానిని నేనే తెలుగులోకి అనువదించుకున్నా. ఉన్నది ఉన్నట్టు చెబితే.. ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి భావం చెడకుండా మార్పులు చేసి 30 సెక్లన నిడివి ఉండేలా వాయిస్‌ ఓవర్ ఇచ్చాను'' అని చెప్పారు.

కాగా కరోనా గురించి రక్షణ చర్యలు తీసుకోవటంపై రెండు రకాల కాలర్ ట్యూన్‌లు ఇచ్చారు పద్మావతి. ఒకటి వ్యాధిపై అవగాహన. వైద్యులను, పోలీసులను, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలంటూ మరో కాలర్ ట్యూన్ చేశారు. వైజాగ్‌లో డిగ్రీ చేసిన పద్మావతి ఢిల్లీలో ఉంటున్నారు. ఈమె భర్త డీవీ ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కాగా దాదాపు పదేళ్ల నుంచి పలు కార్యక్రమాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే రేడియో కార్యక్రమాలకు పద్మావతినే వాయిస్ ఓవర్ ఇస్తూంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories