IQ Test Puzzles: గెట్‌ రడీ ఫర్‌ గ్రేట్‌ పజిల్‌.. ఈ ఫొటోలో తప్పును కనిపెట్టండి చూద్దాం

IQ Test Puzzles: గెట్‌ రడీ ఫర్‌ గ్రేట్‌ పజిల్‌.. ఈ ఫొటోలో తప్పును కనిపెట్టండి చూద్దాం
x
Highlights

IQ Test Puzzles to check your eye power: బ్రెయిన్‌ టీజర్స్‌, పజిల్‌ సాల్వ్‌, ఆప్టికల్ ఇల్యూజన్ ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ మనిషి ఆలోచన శక్తిని...

IQ Test Puzzles to check your eye power: బ్రెయిన్‌ టీజర్స్‌, పజిల్‌ సాల్వ్‌, ఆప్టికల్ ఇల్యూజన్ ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ మనిషి ఆలోచన శక్తిని పరీక్షించేవే. అయితే వీటిలో కొన్ని మన కంటి పవర్‌ను టెస్ట్‌ చేస్తే మరికొన్ని ఆలోచనల శక్తిని పరీక్షిస్తాయి. అయితే కొన్ని రకాల పజిల్స్‌ అటు ఐ పవర్‌తో పాటు ఇటు థింకింగ్ పవర్‌ను కూడా టెస్ట్‌ చేస్తాయి. అలాంటి ఓ ఫొటోనే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైన ఉన్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఒక కుర్రాడు సోఫాలో కూర్చొని పుస్తకం చదువుతున్నట్లు కనిపిస్తోంది కదూ! ఇంకా జాగ్రత్తగా గమనిస్తే అక్కడే ఒక పిల్లి కూడా ఉంది. అలాగే సెల్ఫులో కొన్ని పుస్తకాలు, గోడకు ఒక గడియారం ఉంది అంతే కదూ! అయితే ఈ ఫొటోలో ఓ తప్పు ఉంది. దానిని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్‌ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ తప్పును కేవలం 10 సెకండ్లలో కనిపెట్టడమే ఈ టాస్క్‌ ముఖ్య ఉద్దేశం. మరెందుకు ఆలస్యం ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయగలరేమో ప్రయత్నించండి. ఆ తర్వాతే జవాబు కోసం చూడండి.

ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న తప్పును కనిపెట్టారా లేదా? లేదంటే ఫొటోను మరోసారి తీక్షణంగా గమనించండి. ఇట్టే సమాధానం దొరికి పోతుంది. అయితే ఈ తప్పును కనిపెట్టాలంటే కేవలం ఐ పవర్ మాత్రమే కాదు, కొంత ఆలోచన శక్తితో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలి.


ఇంత చెప్పినా సమాధానం గుర్తించలేకపోయారా.? అయితే ఓసారి గోడకు ఉన్న గడియారాన్ని జాగ్రత్తగా గమనించండి. అందులో 7 గంటల తర్వాత 8కి బదులుగా 3 నెంబర్‌ ఉంది. అలాగే 2 తర్వాత 3 నెంబర్‌కి బదులుగా 8 ఉంది. ఇదే ఈ ఫొటోలో ఉన్న తప్పు.

Show Full Article
Print Article
Next Story
More Stories