Train Ticket: GNWL25/WL6.. ట్రైన్ టికెట్‌లో ఇలా కనిపిస్తే, అర్థమేంటో తెలుసా.. కన్ఫామ్ బెర్త్ వస్తుందా లేదా?

Check WL and GNWL Meanings on Train Tickets While Booking in IRCTC
x

Train Ticket: GNWL25/WL6.. ట్రైన్ టికెట్‌లో ఇలా కనిపిస్తే, అర్థమేంటో తెలుసా.. కన్ఫామ్ బెర్త్ వస్తుందా లేదా?

Highlights

Train Ticket: ట్రైన్ జర్నీ చేయాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. ఇక పండుగల సమయంలో టికెట్ బుక్ చేసుకున్నా.. అది కన్ఫామ్ అవుతుందా లేదా టెన్షన్ అందరిలో ఉంటుంది.

Train Ticket: ట్రైన్ జర్నీ చేయాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. ఇక పండుగల సమయంలో టికెట్ బుక్ చేసుకున్నా.. అది కన్ఫామ్ అవుతుందా లేదా టెన్షన్ అందరిలో ఉంటుంది. అందుకే చాలామంది కొన్ని నెలల ముందే బుక్ చేసుకుంటుంటారు. కొందరికి మాత్రం ఇలా కుదరదు. ఈ క్రమంలో వెయిటింగ్ లిస్టు ఉన్నా టికెట్ బుక్ చేస్తుంటారు. దీంతో GNWL25/WL6 వంటి నంబర్లతో టికెట్లు బుకింగ్ సమయంలో కనిపిస్తుంటాయి.

అయితే, సాధారణంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ నంబర్ ఇలా ఉంటే, వీటిలో ఏది అసలు నంబర్ అని తేల్చుకోలేకపోతుంటారు. ఇలాంటి నంబర్‌లో టికెట్ వచ్చినప్పుడు దానిని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఇలాంటి టికెట్ కన్ఫామ్ అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం.

GNWL అంటే జనరల్‌ వెయిటింగ్‌ లిస్ట్ అని చెబుతుంటారు. అసలు దీనర్థం ఏంటంటే.. వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితాలో ఎంత మంది ప్రయాణికులకు ఇలాంటి టికెట్లు జారీ చేశారో ఈ నంబర్ చెబుతుందన్నమాట. వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ కొనుగోలు చేసిన వారికి సంఖ్య పెరుగుతూ ఉంటే, ఈ సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట. కొంతమంది టికెట్‌ రద్దు చేసుకుంటే.. ఈ వెయిటింగ్‌ లిస్ట్‌ సంఖ్య కూడా మారుతుంది.

ఓ ఉదాహరణను చూద్దాం.. GNWL25/WL6 ఇలా ఉంటే.. మొత్తం 25 మంది వెయిటింగ్ లిస్ట్‌ జాబితాలో టికెట్లు బుక్‌ చేసుకుంటే.. వెయిటింగ్ లిస్టులో ప్రస్తుతం ఉన్నది 6 గురే అన్నమాట. అంటే, మిగతా 19 మంది టికెట్లను రద్దు చేసుకున్నారని దీనర్థం. కాబట్టి, మరోసారి టికెట్ బుక్‌ చేసుకునే సమయంలో ఇలాంటి తేడాను అర్థం చేసుకోండి. అప్పుడు, మీ టికెట్ కన్ఫామ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories