Viral: బుసలు కొడుతోన్న చిట్టి పాము.. ఈ ఫొటోలోనే దాగుంది, చూశారా.?

Can You Find There is a Snake in This Photo
x

Viral: బుసలు కొడుతోన్న చిట్టి పాము.. ఈ ఫొటోలోనే దాగుంది, చూశారా.?

Highlights

Viral: కొన్ని దృశ్యాలు చూసే కళ్లను సైతం మోసం చేస్తుంటాయి. కంటికి కనిపించీ కనిపించకుండా ఉండే వస్తువులు కళ్లను మాయ చేస్తుంటాయి.

Viral: కొన్ని దృశ్యాలు చూసే కళ్లను సైతం మోసం చేస్తుంటాయి. కంటికి కనిపించీ కనిపించకుండా ఉండే వస్తువులు కళ్లను మాయ చేస్తుంటాయి. సహజంగా క్లిక్‌ మనిపించిన ఫొటోల్లో కూడా ఇలాంటి అద్భుతాలు అడపాదడపా వెలుగులోకి వస్తుంటాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలకు ఫుల్‌ డిమాండ్ పెరిగింది. ఆప్టికల్ ఇల్యూజన్‌ పేరుతో ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

దీంతో వీటికి లైక్‌ల వర్షం కురుస్తోంది. పైగా కిక్కునిచ్చే ఇలాంటి ఫొటోలకు నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి ఫొటోలు రోజుకు వందల సంఖ్యలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ ఫోటొనే నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు చెప్పే వరకు ఆ ఫొటోలో ఉన్న అసలు విషయాన్ని గుర్తించలేకపోతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న ఆ ఫొటోకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఒక స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న పచ్చటి మొక్కలు కనిపిస్తున్నాయి కదూ! అయితే ఈ ఫొటోలో ఓ చిన్న పాము పిల్ల కనిపిస్తోంది కనిపెట్టారా.? పేరుకు చిన్న పామే అయినా బుసలు కొడుతు ముందుకు సాగుతోంది. అయితే పాము రంగు అచ్చంగా ఆ మొక్కలను పోలి ఉండడంతో కనిపెట్టడం అంత సులువైన విషయం కాదు. కానీ ఆకులై ఆకునై అన్నట్లు ముందుకు వెళ్తున్న ఆ పామును గుర్తించగలిగితే మీ ఐ పవర్‌ కేక అని అర్థం చేసుకోవాలి.

ఇంతకీ మీరు ఆపామును గుర్తు పట్టారా.? లేదా.? అయితే ఓసారి తీక్షణంగా ఆ ఫొటోను గమనించండి మీకే ఆ పాము కనిపిస్తుంది. నలుపు రంగుతో పాటు కాస్త గ్రీన్ మిక్స్ కలర్‌లో ఉన్న ఆ పామును గుర్తించడం అంత సులువైన విషయం కాకపోయిన్పటికీ ప్రయత్నిస్తే మాత్రం సింపుల్‌గానే కనిపెట్టవచ్చు. ఎంత ప్రయత్నించినా పామును కనిపెట్టలేకపోతే ఓసారి స్విమ్మింగ్ పూల్‌కు ఆనుకొని ఉన్న గోడపై చూడండి నెమ్మదిగా నీటిలో దూకడానికి ప్రయత్నిస్తున్న పాము కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా కనిపించకపోతే సమాధానం కోసం కింద ఫొటో చూడండి.



Show Full Article
Print Article
Next Story
More Stories