Bitter guard garlic fry: కాకరకాయ వెల్లుల్లి వేపుడు ఇలా చేసి చూడండి. ఇంటిల్లిపాదీ వదలకుండా తినేస్తారంతే!

Bitter guard garlic fry: కాకరకాయ వెల్లుల్లి వేపుడు ఇలా చేసి చూడండి. ఇంటిల్లిపాదీ వదలకుండా తినేస్తారంతే!
x
Bitter guard
Highlights

Bitter guard garlic fry: కాకరకాయ అంటేనే పిల్లలు మొఖం మాడుస్తారు. అబ్బా చేదు అంటూ ముడుచుకుపోతారు. అయితే, కాకరకాయ కూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయాన్ని ఎంత చెప్పినా పిల్లలు వినిపించుకోరు.

Bitter guard garlic fry: కాకరకాయ అంటేనే పిల్లలు మొఖం మాడుస్తారు. అబ్బా చేదు అంటూ ముడుచుకుపోతారు. అయితే, కాకరకాయ కూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయాన్ని ఎంత చెప్పినా పిల్లలు వినిపించుకోరు. అటువంటి వారికోసం కాకరకాయను ఇలా చేసి చూడండి.. కాకరకాయే వద్దన్నవాళ్ళు.. అదే కావాలంటూ మారాం చేస్తారు. వెల్లుల్లితో కలిపి కాకరకాయ వేపుడు చేస్తే అందరికీ నచ్చుతుంది. మరి ఈ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందామా..

కాకరకాయ వెల్లుల్లి వేపుడుకు కావలసిన వస్తువులు ఇవే..

కాకర కాయలు - పావుకిలో

వెల్లుల్లి రెబ్బలు - పది

మినప్పప్పు - రెండు చెంచాలు

పల్లీ పొడి - 3చెంచాలు

ఉల్లిపాయ - ఒకటి

కారం పొడి - రెండు చెంచాలు

ఉప్పు - తగినంత

నూనె - 5-6 చెంచాలు

కరివేపాకు - ఒక రెబ్బ

పసుపు - పావు చెంచా

ఇలా చేసుకోవాలి..

కాకరకాయలను శుభ్రంగా కడిగి.. గుండ్రంగా పల్చగా ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి అది బాగా వేడయ్యాకా అందులో 5స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడి ఎక్కాకా.. కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. తరువాత మంట పెద్దదిగా పెట్టుకుని కాకరకాయ ముక్కలు నూనెలో ఉడికి.. ముక్కలు గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకూ బాగా కలుపుతూ ఉండాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాకా ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే మూకుడులో అరచెంచా నూనె వేసుకుని మినపప్పు వేసుకుని వేయించాలి. ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి.

ఉల్లిపాయలు వేగాక కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒక నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు ముందుగానే ఉడికాయి కాబట్టి ఎక్కువసేపు ఆగకుండా కావలసినంత కారం పొడి వేసుకుని కలుపుకోవాలి. మంట సిమ్ లో పెట్టుకుని అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాల తరువాత వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఆగి దింపేసుకుంటే సరిపోతుంది. ఇది వేడి వేడి అన్నం లో, చపాతీ లో తింటే చాలా బాగుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories