Bigg Boss 7 Telugu: పాపం యావర్.. సీరియల్ బ్యాచ్ దెబ్బకు టాస్క్‌ నుంచి ఔట్..

Bigg Boss 7 Telugu: పాపం యావర్.. సీరియల్ బ్యాచ్ దెబ్బకు టాస్క్‌ నుంచి ఔట్..
x
Highlights

Bigg Boss 7 Telugu: ఉల్టా-పుల్టా అంటూ ఆసక్తి పెంచిన బిగ్ బాస్ 7 తెలుగు సీజన్.. చప్పగా సాగుతోంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా మాత్రం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తోంది.

Bigg Boss 7 Telugu: ఉల్టా-పుల్లా అంటూ ఆసక్తి పెంచిన బిగ్ బాస్ 7 తెలుగు సీజన్.. చప్పగా సాగుతోంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా మాత్రం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తోంది. చెప్పేది ఒకటి.. చేపించే మరొకటి అన్నట్లు సాగుతోంది. గత రెండు రోజులుగా పవర్ అస్త్రం కోసం హౌజ్‌లోని కంటెస్టెంట్ల మధ్య పోరు జరగుతోంది. పవర్ అస్త్రం కోసం పోటీ పెట్టి మరీ.. అంతలోనే విన్నర్ ఎవరో మీరే తెల్చుకోవాలంటూ వారికే ఆఫ్షన్స్ ఇవ్వడంతో ఆసక్తిలేకుండా మార్చేశాడు బిగ్ బాస్. కష్టపడి గేమ్స్‌లో గెలుపొందిన వారిని ఓడినట్లు అనౌన్స్ చేయడం.. సత్తా లేని వారిని టాస్క్‌లకు పంపడంతో పోటీలో ఇంట్రెస్ట్ లేకుండా పోతోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రిన్స్ యావర్ ఏడుపు చూస్తే.. ఈ విషయం తప్పక అర్థమవుతోంది. హౌస్‌లోని వారే కాదు.. ఆడియెన్స్ కూడా ఎమోషనల్ అయ్యేలా చేశాడు. కష్టపడి ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాడు. కానీ, అర్హుడివి కాదంటూ టాస్క్ నుంచి పక్కన పెట్టేశారు సీరియల్ టీం. ముఖ్యంగా యావర్ ఇద్దరు అమ్మాయిలతో వాదించలేక టాస్క్ నుంచి తప్పుకున్నాడు.

తాజా ప్రోమోలో హౌస్‌లో పెద్దాయన శివాజీ ఎదుట యావర్ ఎమోషనల్ అయినట్లు చూడొచ్చు. తనలోని బాధనంతా బయటపెట్టిర యావర్, కన్నీళ్లు పెట్టించాడు. ఇది చూసిన శివాజీకి కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో యావర్‌కు ధైర్యం ఇచ్చేలా మాట్లాడాడు. నిన్ను ఇక్కడి వరకు దేవుడు తీసుకొచ్చాడు. నీకు టైం వస్తుందని గుర్తు పెట్టుకో అంటూ అండగా నిలిచాడు.



ఇక 3వ పవరాస్త్రం దక్కించుకోవడానికి ప్రియాంక జైన్, శోభా శెట్టి తీవ్రంగా పోటీపడ్డారనే చెప్పుకోవాలి. కాగా, వీరిద్దరికి ఎద్దుపై ఎక్కువ సమయం ఉండేందుకు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గెలిచిన వాళ్లకు 3వ పవరాస్త్రం దక్కుతుందని, అలాగే విజేతకు 3 వారాల ఇమ్యూనిటీ వస్తుందని ప్రకటించారు. ప్రోమోలో ప్రియాంక, శోభా మధ్య పోటీని చూపించారు. ఎవరు గెలిచారనేది ఈరోజు ఎపిసోడ్‌లోనే చూడాల్సి ఉంటుంది. వీరిద్దరు మూడో పోటీదారుడైన ప్రిన్స్ యావర్‌ను అర్హుడివి కాదంటూ టాస్క్‌ నుంచి పక్కన పెట్టేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories