తెలంగాణ సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ.. దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా మరెక్కడా పూలను పూజించే..

Bathukamma is a Hindu Goddess Festival Celebrated Predominantly in Telangana
x

తెలంగాణ సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ.. దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా మరెక్కడా పూలను పూజించే..

Highlights

History of Bathukamma: బతుకమ్మ పండుగ...తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.

History of Bathukamma: బతుకమ్మ పండుగ...తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. తెలంగాణ అంతా పచ్చని పొలాలు, నిండిన చెరువులు, పొంగుతున్న వాగులతో కళకళలాడుతున్న సమయంలో చేసుకునే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ. ప్రకృతి మురిసిపోయేట్టు రంగురంగుల పూలను పేర్చి ఆడుకునే రంగుల పండుగ బతుకమ్మ. తెలంగాణలోనే మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మరెక్కడా పూలను పూజించే పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. ఆదివారం జరిగే ఎంగిలిపూల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు తెలంగాణ ఆడపడుచులు ముస్తాబవుతున్నారు.

ఒక్కొక్క పువ్వేసి చందమామా...ఒక్క జాము గడిచె చందమామా అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు తెలంగాణ ఆడపడుచులు. పసిడి తంగేడు పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని మురిసిపోతారు తెలంగాణ ఆడబిడ్డలు. వానాకాలం ముగుస్తూ, చలికాలం మొదలవుతున్నప్పుడు చేసుకునే పూలపండుగ బతుకమ్మ. ప్రకృతి మురిసిపోయేట్టు..గునుగు, తంగేడుల అందాలు, అగరబత్తుల పొగలు, వాయినాలు, ప్రసాదాల నడుమ చేసుకునే ఆడబిడ్డల పెద్ద పండుగ. వందల మంది ఒక్క దగ్గర చేరి చేసుకునే గొప్ప పండుగ.

తెలంగాణలో మాత్రమే జరుపుకునే పండుగ'బతుకమ్మ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మరెక్కడా పూలను పూజించే పండుగ కనిపించదు. మొత్తం 9 రోజుల పాటు పువ్వులను ఆటపాటలతో పూజించే పండుగ ఇది. మహాలయ అమావాస్యతో ప్రారంభమై 9రోజుల పాటు వైభవంగా సాగే ఈ పండుగ ఆదివారం ప్రారంభం కానుంది. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మను ఎంతో భక్తితో పాటలు, ఆటలతో పూజిస్తారు. 9రోజుల పాటు వివిధ పేర్లతో పిలుస్తుంటారు. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా చేసుకుంటారు.

పండుగ 9రోజులూ సాయంత్రం పూట మహిళలంతా రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక దగ్గర పెడతారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ ఆడతారు. బతుకమ్మ పాటల్లో తెలంగాణ జీవనవిధానం, ఆచారాలు, సంస్కృతి కలగలిపి ఉంటాయి. అలాగే బతుకమ్మల మీద పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆ తల్లి తమ పసుపు, కుంకుమలను పదికాలాల పాటు చల్లగా ఉండేలా కాపాడుతుందని మహిళలు నమ్ముతారు. ఇక బతుకమ్మ నైవేద్యాలు 9రోజులకు తొమ్మిది పేర్లున్నట్లే రోజుకోరకం ప్రసాదం గౌరమ్మకు నైవేథ్యంగా పెడతారు. బతుకమ్మ ఆడిన తర్వాత వాటిని నీళ్లలో వేశాక, తెచ్చిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు. కొందరు 9 రోజులూ కుదరకున్నా మొదటిరోజు చేసే ఎంగిలి పూల బతుకమ్మ, చివరిరోజున సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు.

9 రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మొదటి రోజు జరిగే ఎంగిలిపూల బతుకమ్మ, చివరి రోజు జరిగే సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories