Guinness Record: హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో మైలు రాయి.. ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ తయారీ

Guinness Record: హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో మైలు రాయి.. ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ తయారీ
x

Guinness Record: హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో మైలు రాయి.. ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ తయారీ

Highlights

Guinness Record: ఎన్నో ప్రపంచ రికార్డ్స్‌ను స్వంతం చేసుకున్న హైదరాబాద్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది.

Guinness Record: ఎన్నో ప్రపంచ రికార్డ్స్‌ను స్వంతం చేసుకున్న హైదరాబాద్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలోనే ఇప్పటిదాకా అతి భారీ కేక్‌ను రూపొందించిన హార్లీస్‌ ఇండియా ఫైన్ బేకింగ్‌ హైదరాబాద్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని జేర్చింది.

హైదరాబాద్ ఆధారిత హార్లీస్‌ ఇండియా ఫైన్ బేకింగ్‌ రూపొందించిన 2,254 కిలోల అత్యంత భారీ కేక్‌ను కొండాపూర్‌లోని మాయా కన్వెన్షన్‌ సెంటర్‌లో తయారు చేసి ప్రదర్శించింది. ప్రపంచంలోనే అతిపెద్ద రష్యన్ మెడోవిక్‌ హనీ కేక్‌ను రూపొందించడం ద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సాధించి హార్లీస్‌ ఇండియా ఫైన్ బేకింగ్‌ లో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఈ కేక్ కళాఖండాన్ని రూపొందించడానికి 500 మందికి పైగా బేకర్లు, చెఫ్‌లు ఈ ప్రదర్శనలో పాలపపంచుకున్నారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టీమ్‌ నుండి గిన్నిస్‌ ఇండియా తరపున ఈ అరుదైన ఫీట్‌కు అధికారిక గుర్తింపు అందించారు. న్యాయనిర్ణేతలు రిషి నాథ్, నిఖిల్‌ శుక్లాలు సురేశ్‌ నాయక్‌కు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికేట్‌ను అందజేశారు.

టాలీవుడ్ సినీ రచయిత, దర్శకుడు చిన్ని కృష్ణ, సినీ దర్శకుడు, చందు మొండేటి, హీరో భరత్ రెడ్డి, సందీప్ మాధవ్ తదతరులు కూడా హాజరై, సురేష్ నాయక్ ను అభినందించారు.

ఈ సందర్భంగా హార్లీస్‌ ఇండియా సి.ఇ.ఓ సురేష్‌ నాయక్‌ మాట్లాడుతూ ఈ కేక్‌ 2,254 కిలోల బరువు, 7 / 70 అడుగుల కొలతలతో ఉందన్నారు. ఇది స్పిన్నీస్‌ దుబాయ్‌ కంపెనీ నెలకొల్పిన మునుపటి రికార్డును 10 రెట్లు ఎక్కువగా తేడాతో బద్దలు కొట్టిందన్నారు. ఈ రికార్డ్‌ సాధించాలనే లక్ష్యంతో, పక్కా ప్రణాళికతో చేసిన తమ ప్రయత్నం అద్భుత విజయం సాధించిందంటూ ఆనందం వ్యక్తం చేశారు తాము రూపొందించిన ఈ అతిభారీ రష్యన్ మెడోవిక్‌ హనీ కేక్‌ కేవలం డెజర్ట్‌ మాత్రమే కాదు, సమిష్టి కృసి అంకితభావాలకు సృజనాత్మక ఆవిష్కరణకు చిహ్నంగా ఆయన పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories