Viral Video: అప్పుడే గుడ్డలోంచి వస్తున్న కింగ్‌ కోబ్రా.. వీడియో చూస్తే షాక్‌ అంతే..!

The birth of a baby cobra
x

Viral Video: అప్పుడే గుడ్డలోంచి వస్తున్న కింగ్‌ కోబ్రా.. వీడియో చూస్తే షాక్‌ అంతే..!

Highlights

Viral Video: ప్రతీ జీవి పుట్టుక ఒక వింత. గర్భంలో ఎదిగిన తర్వాత తల్లి శరీరం నుంచి బయటకు వచ్చే జీవులు కొన్నైతే.

Viral Video: ప్రతీ జీవి పుట్టుక ఒక వింత. గర్భంలో ఎదిగిన తర్వాత తల్లి శరీరం నుంచి బయటకు వచ్చే జీవులు కొన్నైతే. గుడ్డు నుంచి వచ్చేవి మరికొన్ని. గట్టిగా ఉండే గుడ్డును పగలగొట్టుకుంటూ ప్రపంచంలోకి వస్తుంటాయి జీవులు. ముఖ్యంగా కోడి పిల్లలు గుడ్డులో నుంచి బయటకు వస్తుంటే చూడ్డాని ఎంతో వింతగాను, బాగాను కనిపిస్తుంటాయి కదూ! అలాంటిది పాము గుడ్డులో నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది?

వామ్మో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదూ! అయితే కోడి పిల్లలు, మరో ప్రాణులకు సంబంధించి గుడ్డు నుంచి బయటకు వచ్చేవి చూస్తుంటాం. కానీ పాము పిల్ల గుడ్డులో నుంచి బయటకు రావడం జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు కదూ! అయితే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీది సాధ్యమే అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఓ వ్యక్తి చేతిలో చిన్న గుడ్డును పట్టుకున్నాడు. ఆ గుడ్డు నెమ్మదిగా పగలడం ప్రారంభమైంది. అందులో నుంచి ఓ చిన్న పాము బయటకు రావడం ఆ వీడియోలో గమనించవచ్చు. అప్పుడే పుట్టిన కింగ్‌ కోబ్రా తానేం తక్కువ తినలేదు అన్నట్లు బుసలు కొడుతోంది. దీనంతటినీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది.

క్షణాల్లో లక్షల వ్యూస్‌తో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. అంత చిన్న పాలు బుసలు కొడుతుండడం చూస్తుంటే భయం వేస్తోందని కొందరు అంటుంటే.. మరికొందరు ఇంత చిన్న పామును జీవితంలో చూడడం ఇదే తొలిసారి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories