చేయి చాపు..తీర్థం తీసుకో.. ఆలయాల్లో ఆటోమేటిక్ తీర్థ యంత్రాలు!

చేయి చాపు..తీర్థం తీసుకో.. ఆలయాల్లో ఆటోమేటిక్ తీర్థ యంత్రాలు!
x
Highlights

కరోనా చేయని విన్యాసాలు లేవు. ఈ మహమ్మారితో మన జీవితాలలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. చేతులు రెండు సార్లు కడుక్కున్న వారిని చూసి...

కరోనా చేయని విన్యాసాలు లేవు. ఈ మహమ్మారితో మన జీవితాలలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. చేతులు రెండు సార్లు కడుక్కున్న వారిని చూసి మహానుభావుడు అనుకునే వారంతా.. పదినిమిషాలకు ఒకసారి శానిటైజర్ పులిమేసుకుంటున్నారు. ఇక భగవంతుని దర్శనానికి కూడా ఒకరి మీద ఒకరు పడి నేట్టేసుకునే పధ్ధతి నుంచి మూడడుగుల దూరం పాటిస్తూ క్రమశిక్షణతో దైవదర్శనం చేసుకుంటున్నారు.

వరుస లాక్దౌన్ లతో ఆలయాలూ మూతపడ్డాయి. అన్‌లాక్ -1లో భాగంగా దేవాలయాలు భక్తుల కోసం తెరిచే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అయితే, దానికి షరతులు విధించింది. భౌతిక దూరం పాటించడం తో పాటు.. ఆలయంలో భక్తులు అలవాటుగా చేసే కొన్ని పనులను నిషేధించింది. గుడిలో గంట కొట్టడం, తీర్థ ప్రసాదాలు ఇవ్వడం వంటివి కూడదని చెప్పింది. కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం ఈ విధమైన ఆంక్షలు విధించింది ప్రభుత్వం.

అయితే, గుడికి వెళ్ళిన భక్తుడికి గంట కొట్టకపోతే ఎదో మర్చిపోయిన భావన కలుగుతుంది. అదేవిధంగా దైవ దర్శనం అనంతరం తీర్థం తీసుకోకపోతే దేవుడిని చూసినట్టే అనిపించదు కొందరికి. మరి ఆ లోటు తీర్చడం ఎలా అని కొన్ని ఆలయాల నిర్వాహకులు తీవ్రంగా ఆలోచించారు. దేవుడికీ టెక్నాలజీ తప్పదని నిర్ణయానికి వచ్చారు. భక్తుడు ఆలయంలో గంట వద్ద నిలబడితే చాలు గంట దానంత అది మోగే విధంగా కొన్ని ఆలయాల్లో సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఇది చూసిన తరువాత మంగుళూరులో ఒకాయనకి తీర్థం ఇవ్వడానికీ ఒక టెక్నాలజీ వాడొచ్చు కదా అనిపించింది. ఇంకేముంది. ఆ పని మొదలు పెట్టేశాడు.

చెయ్యిపెడితే తీర్థం..

దేవుని దర్శనం చేసుకుని నిర్దేశిత ప్రాంతంలో చేయి పెడితే తీర్థం దానంత అదే చేతిలో పడిపోతుంది. మంగుళూరుకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ దీన్ని తయారుచేశారు. దీనికీ తీర్థ డిస్పెన్సర్ (తీర్థ పంపిణీ యంత్రం) అని ముద్దుగా పేరూ పెట్టారు.

గుడిలోకి వెళ్లి దేవుని దర్శనం పూర్తి అయిన తరువాత ఈ తీర్థ పంపిణీ యంత్రం వద్ద నిలబడి చేయి చాపితే చాలు లెక్క ప్రకారం తీర్థం చేతిలో పడి డనంత అదే ఆగిపోతుంది. అబ్బ తెర్థం ఎంత బావుందో అని ఇంకా కావాలనుకుంటే అక్కడనుంచి వెళ్లి చేయి కడుక్కుని మళ్ళీ చేయిచాపాలి అంతే. ఈ యంత్రం ఏర్పాటు చూసిన తరువాతా కర్నాటక లోని చాలా ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి సంతోష్ సహాయం కోరుతున్నారట. అన్నట్టు ఈ యంత్రానికి ఎంత ఖర్చయిందో తెలుసా.. 2,700 రూపాయలు. భక్తులకు సంతృప్తి కలగడమే ముఖ్యం కానీ ఈ ఖర్చు పెద్ద లెక్కలోనిది కాదు కదా! ఇక మనకూ ఇటువంటి ఏర్పాటు వచ్చేసే అవకాశాలు చాలా ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories